Johnny Wactor: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. 37 ఏళ్ల హాలీవుడ్ న‌టుడు కాల్చివేత‌

ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారు సమీపంలో ఉన్నారు. జానీ వెక్టర్ కారు నుంచి ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు జానీ వెక్టర్ పై కాల్పులు జరిపాడు. నటుడిపై కాల్పులు జరిపిన అనంతరం ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులను గుర్తించే పనిలో ఉన్నారు

Johnny Wactor: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. 37 ఏళ్ల హాలీవుడ్ న‌టుడు కాల్చివేత‌
Johnny Wactor
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2024 | 12:06 PM

మనిషి జీవితం క్షణ భంగురం అని అంటారు పెద్దలు. మనిషికి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఎవరి ఆయుష్షు ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఎవరు ఏ సమయంలో ఆయుష్షు తీరి మరణానికి చేరువు అవుతారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏ రూపంలో మృత్యువుని చేరుకుంటారో గుర్తించలేరు కూడా. మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో దుండ‌గులు రెచ్చిపోయారు. అమెరికన్ నటుడు జానీ వెక్టర్ 37 ఏళ్లకే మృత్యువాత పడ్డాడు. దుండగులు కాల్చి చంపేశారు. నివేదికల ప్రకారం ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లు చెబుతున్నారు. జానీ వాక్టర్ అనేక సినిమాలు, టీవీ షోలలో పనిచేశాడు. వెక్టర్ తల్లి కూడా తన కొడుకు మరణాన్ని ధృవీకరించింది.

అసలు విషయం ఏమిటంటే?

నివేదికల ప్రకారం తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. అక్కడ జానీ వాక్టర్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తన స్నేహితులతో  సరదాగా గడుపుతున్నాడు. ఈ సమయంలో అతని స్నేహితులలో ఒకరి దృష్టి నటుడి కారుపైకి వెళ్ళింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారులోని ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే వాదన చోటు చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తులు జానీ వాక్టర్ పై కాల్పులు జరిపారు. నటుడిపై కాల్పులు జరిపిన అనంతరం ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులను గుర్తించే పనిలో ఉన్నారు. తన కొడుకు మరణంపై తల్లి స్కార్లెట్ వాక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దొంగలను గుర్తించిన తర్వాత.. దొంగ కాల్పులు జరుపుతున్నప్పుడు తన కొడుకు పోరాటం చేయలేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

హాలీవుడ్ నటుడి జానీ వాక్టర్ మృతికి సంతాపం తెలియజేస్తోంది. జానీ వాక్టర్ కెరీర్‌లో నటుడు సైబీరియా, క్రిమినల్ మైండ్స్, ఆర్మీ వైవ్స్, ది OA, హాలీవుడ్ గర్ల్, ది వెస్ట్‌వరల్డ్ వంటి అనేక ప్రాజెక్ట్‌ల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించాడు. అంతేకాదు అతను ప్రముఖ షో జనరల్ హాస్పిటల్‌కు ప్రసిద్ధి చెందాడు. జానీ వాక్టర్ మృతితో నటుడి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. జానీ వాక్టర్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జానీ వాక్టర్ కు తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..