AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతా అంబానీ ధరించిన ‘ఎమరాల్డ్ నెక్లెస్’ విలువ తెలిస్తే షాక్.. దేశంలో పచ్చల వ్యాపారం ఎలా జరుగుతుందంటే

'పన్నా' విలువ కూడా డైమండ్ లాగానే నిర్ణయించబడుతుంది. దీని ధర కూడా 4C అంటే కట్, క్యారెట్, క్లారిటీ, కలర్ ప్రకారం నిర్ణయించబడుతుంది. పచ్చల రాళ్లలో పసుపు లేదా తెలుపు స్పర్శ ఉన్నా.. లేదా ఎక్కువ నీలం రంగు కలిగి ఉన్నా దాని విలువ తగ్గుతుంది. అందుకే 'పన్నా'కి ఉత్తమ ధరను అందించే రంగు 'ఆకుపచ్చ రంగు'.

నీతా అంబానీ ధరించిన 'ఎమరాల్డ్ నెక్లెస్' విలువ తెలిస్తే షాక్.. దేశంలో పచ్చల వ్యాపారం ఎలా జరుగుతుందంటే
Panna Stone
Surya Kala
|

Updated on: May 27, 2024 | 10:33 AM

Share

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి సంబంధించిన వివరాలు ఒకొక్కటి వెలుగులోకి రావడం మొదలు పెట్టాయి. అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కుటుంబం తమ ఇంట్లో జరుగుతున్న పెళ్ళికి ఎలాంటి సన్నాహాలు చేస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పెళ్లి బట్టలు ఎవరు డిజైన్ చేస్తున్నారు? అంబానీ ఫ్యామిలీకి చెందిన మహిళలు ఎలాంటి డిజైనర్ నగలు ధరించబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా అనంత్-రాధికల మొదటి ప్రీ వెడ్డింగ్‌లో నీతా అంబానీ ధరించిన అందమైన ‘పన్నా’ నెక్లెస్‌ గురించి.. ఇందులోని పొదిగిన పచ్చల గురించి తెలుసుకుందాం..

నీతా అంబానీ ధరించిన నెక్లెస్‌లో వజ్రాలు మాత్రమే కాదు రెండు పెద్ద స్క్వేర్ టైప్ లో ‘పచ్చ రాయి’ కూడా పొదిగి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన రాయి ‘ఎమరాల్డ్స్’. ఇవి వజ్రాల తర్వాత అత్యధికంగా వర్తకం అయ్యే విలువైన రాళ్లు. వజ్రాల కటింగ్‌లో భారతదేశం (సూరత్) ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఖ్యాతిగాంచింది. అయితే పచ్చ కటింగ్‌లో కూడా గ్లోబల్ లీడర్‌గా ప్రసిద్ది చెందింది రాజస్థాన్‌లోని జైపూర్ నగరం. పచ్చల వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసా?

పచ్చల ప్రత్యేకత ఏమిటంటే? పచ్చ నిజానికి గట్టి రత్నం. ఈ రత్నానికి ఆకుపచ్చ రంగు ప్రత్యేకతను తీసుకొచ్చింది. క్రీస్తు జననానికి 330 సంవత్సరాల ముందు ఈజిప్టులో పచ్చని మొట్టమొదట సేకరించారని నమ్ముతారు. ఈజిప్షియన్ రాణి క్లియోపాత్రా అందానికి పర్యాయపదంగా పరిగణించబడుతుంది, ఆమె ‘పచ్చల’తో చేసిన అద్భుతమైన ఆభరణాల సేకరణను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో కూడా పచ్చల చరిత్ర వేల సంవత్సరాల నాటిది. జ్యోతిషశాస్త్రంలో ఇది రాశికి చెందిన రత్నంగా గుర్తించబడింది. పచ్చ 12 రాశులకు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటుంది. కనుక వ్యక్తుల రాశి ప్రకారం మేలో జన్మించిన వ్యక్తులు దీనిని తమ జన్మ రాయిగా ఉపయోగిస్తారు. బలహీనమైన బుధుడు ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుందని విశ్వాసం.

Panna Stone 1

Panna Stone 1

‘ఎమరాల్డ్’ భారతదేశంలోని ఆభరణాలలో ఎల్లప్పుడూ ఒక భాగం. హైదరాబాద్ పాలకులైన నిజాం రాజులు పచ్చలతో చేసిన ఆభరణాలను అమితంగా ఇష్టపడేవారని తెలుస్తోంది. ఆ నగలు ఇప్పుడు భారత ప్రభుత్వ ఖజానాలో భాగం.

పచ్చ ధర ఎలా నిర్ణయించబడుతుంది? ‘పన్నా’ విలువ కూడా డైమండ్ లాగానే నిర్ణయించబడుతుంది. దీని ధర కూడా 4C అంటే కట్, క్యారెట్, క్లారిటీ, కలర్ ప్రకారం నిర్ణయించబడుతుంది. పచ్చల రాళ్లలో పసుపు లేదా తెలుపు స్పర్శ ఉన్నా.. లేదా ఎక్కువ నీలం రంగు కలిగి ఉన్నా దాని విలువ తగ్గుతుంది. అందుకే ‘పన్నా’కి ఉత్తమ ధరను అందించే రంగు ‘ఆకుపచ్చ రంగు’.

‘ఎమరాల్డ్’ ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాలలో కనిపిస్తుంది. అత్యుత్తమ నాణ్యత గల పచ్చల రత్నం కొలంబియా నుండి వచ్చింది. అంతేకాదు భారతదేశం, ఈజిప్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, జాంబియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సహా దాదాపు 16 దేశాల్లో ‘పన్నా’ కనిపిస్తుంది. అదే సమయంలో పచ్చలను ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లలు అమెరికా, జపాన్‌లలో కనిపిస్తారు.

Panna Stone 3

Panna Stone 3

భారతదేశంలో పచ్చల స్థానం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో పన్నా అనే స్థలం ఉన్నప్పటికీ వాస్తవానికి అక్కడ ఉన్నవి పచ్చలు కాదు. వజ్రాల గని. ఇండియన్ మినరల్ ఇయర్‌బుక్-2022 ప్రకారం, భారతదేశంలో దాదాపు 55.87 టన్నుల ‘పచ్చలు’ నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా జార్ఖండ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఉన్నాయి.

రాజస్థాన్‌లోని అజ్మీర్-రాజ్‌సమంద్ బెల్ట్‌లో మంచి మొత్తంలో నిల్వలు ఉన్నాయి. జైపూర్ ‘పన్నా’కి సంబంధించిన అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఉండటానికి బహుశా ఇదే కారణం కావచ్చు. పచ్చలను గ్రేడింగ్ నుంచి కటింగ్, పాలిషింగ్, ఆభరణాల తయారీ వరకు జైపూర్‌లో ఎక్కువగా పనులు జరుగుతాయి. అయితే భారతదేశం ఇతర దేశాల నుంచి ‘పన్నా’కి సంబంధించిన ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వాటికి సంబంధించిన పనులు చేసి పచ్చల రత్నాల రూపంలో ఎగుమతి చేస్తుంది.

Panna Stone 2

Panna Stone 2

భారతదేశం నుంచి ‘పన్నా’ ఎగుమతి? ఇండియన్ మినరల్ ఇయర్‌బుక్-2022ను పరిశీలిస్తే భారతదేశం నుంచి కట, అన్‌కట్ ‘పన్నా’ ఎగుమతి వార్షిక ప్రాతిపదికన 103% పెరిగింది. కోవిడ్ కారణంగా దాని ఎగుమతుల్లో క్షీణించినా మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. 2021-22లో భారతదేశం రూ.1090 కోట్ల విలువైన ‘పన్నా’ను ఎగుమతి చేసింది. అమెరికా, హాంకాంగ్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతులు జరిగాయి.

2018-19 ఇండియన్ మినరల్ ఇయర్‌బుక్‌ను పరిశీలిస్తే.. కోవిడ్‌కు ముందు, భారతదేశం రూ. 2303 కోట్ల విలువైన ‘పచ్చ’ను ఎగుమతి చేసింది. 2017-18లో కూడా ఈ ఎగుమతి రూ.1776 కోట్లు. ఇది మాత్రమే కాదు.. ఆ సంవత్సరం భారతదేశం నుంచి అత్యధిక ‘పన్నా’ ఎగుమతి హాంకాంగ్‌కు జరిగింది. దాదాపు 51% పచ్చలు హాంకాంగ్ కు వెళ్లగా దీని తర్వాత స్థానం అమెరికా, థాయ్‌లాండ్‌ లు ఎగుమతి చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..