కాలేజీ స్టూడెంట్స్ చీర, దోతీలను ధరించి అందమైన సీతాకోక చిలుకల్లా మెరుస్తున్న విద్యార్థులు కాలేజీకి వచ్చారు. అది కూడా ట్రాక్టర్లు, చక్రాల బండ్లలో పాఠశాల నుండి కళాశాలకు ప్రవేశం చేశారు. నేటి విద్యావిధానంలో మార్పు రావాలి అని అందరూ వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో కాలేజీలు అంటే చదువు కోసం మాత్రమే కాదు. ఆట, పాట, క్రమశిక్షణ అన్నీ ఉండాలి అని చెబుతున్నారు. వీటన్నింటితో పాటు విద్యార్థులకు భిన్నమైన కార్యక్రమాలు జరగాలి. అప్పుడే విద్యార్థులు ఆనందంగా కళాశాలకు వస్తారు. ఈ కారణంగానే కర్ణాటక ధార్వాడ్‌లోని ఓ కాలేజీ వారం రోజుల పాటు ఫన్ వీక్‌గా జరుపుకుంది. ఈ వారం చివరి రోజు పాఠశాల ఆవరణలో సంప్రదాయ వేడుకలతో కొత్త లోకాన్ని నిర్మించారు.