Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: ‘ఇంకా నేరం రుజువు కాలేదు’.. హేమకు మద్దతు ప్రకటించిన మా అధ్యక్షులు మంచు విష్ణు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్స్‌లో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసు కమిషనర్ ధ్రువీకరించారు . అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపిల్ ను పరీక్షలకు పంపగా.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరాటే కల్యాణి, సహా పలువురు సినీ ప్రముఖులు హేమపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Manchu Vishnu: 'ఇంకా నేరం రుజువు కాలేదు'.. హేమకు మద్దతు ప్రకటించిన మా అధ్యక్షులు మంచు విష్ణు
Actress Hema, Manchu Vishnu
Follow us
Basha Shek

|

Updated on: May 25, 2024 | 8:25 PM

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్స్‌లో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసు కమిషనర్ ధ్రువీకరించారు . అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపిల్ ను పరీక్షలకు పంపగా.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరాటే కల్యాణి, సహా పలువురు సినీ ప్రముఖులు హేమపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు మంచు విష్ణు హేమకు మద్దతుగా ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ‘సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు నటి హేమను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై ఇలాంటి లేని పోని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమపై ఇంకా నేరం రుజువు కాలేదు. కాబట్టి ఆమె దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తరఫున తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్విట్టర్ వేదికగా కోరారు మంచు విష్ణు.

త్వరలోనే విచారణకు

ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.  కాగా బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వినిపించడం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ వీడియో విడుదల చేసింది. అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉందని స్వయంగా పోలీస్ కమిషనర్ చెప్పారు. అలాగే హేమ బ్లడ్ శాంపిల్‌ను పరీక్షలకు పంపగా పాజిటివ్‌గా రావడంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు పోలీసులు త్వరలోఈ టాలీవుడ్ నటిని విచారణకు పిలవనున్నారు.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో