Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix: ఇకపై ఇండియన్ యూజర్లకు నో ఛాన్స్.. గట్టి షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. అదేంటంటే.?

OTT ప్లాట్ ఫామ్స్‌లో రారాజు అంటే నెట్‌ఫ్లిక్స్. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సేవలు అందిస్తుంది. దీని రేటు కూడా చాలా ఎక్కువ. మిగతా OTT లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ రేటు కొన్ని రెట్లు ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు ఇండియాలో ఉన్నవాళ్ళు ఒక్క నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో..

Netflix: ఇకపై ఇండియన్ యూజర్లకు నో ఛాన్స్.. గట్టి షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. అదేంటంటే.?
Netflix
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2024 | 8:38 PM

OTT ప్లాట్ ఫామ్స్‌లో రారాజు అంటే నెట్‌ఫ్లిక్స్. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సేవలు అందిస్తుంది. దీని రేటు కూడా చాలా ఎక్కువ. మిగతా OTT లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ రేటు కొన్ని రెట్లు ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు ఇండియాలో ఉన్నవాళ్ళు ఒక్క నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో  పది, పదిహేను మంది వినోదం పంచుకునేవారు. ఇంకా కొంతమంది అయితే అమెరికా, కెనడా, ఇండియా ఇలా బంధువులు ఏ దేశంలో ఉన్న ఒకే అకౌంట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇన్నాళ్లు ఇండియా మార్కెట్‌లో పట్టు కోసం వేచి చూసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మెల్లగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుగా అన్‌లిమిటెడ్ స్క్రీన్స్‌గా ఉన్న యాప్‌ను నాలుగు నుంచి ఆరు స్క్రీన్‌లకు తగ్గించింది. ఇప్పుడు ఇండియా కోసం స్పెషల్ 199 బడ్జెట్ ప్యాకేజీని తీసుకొచ్చి సింగిల్ స్క్రీన్‌కి పరిమితం చేసింది. ఇక తాజాగా ఎక్కడైతే ఒకే అకౌంట్‌తో వివిధ ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారో.. ఆ అకౌంట్లను కట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నెట్‌ఫిక్స్ హౌస్ హోల్డ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

హౌస్ హోల్డ్ విధానం అంటే ఎక్కడైతే నెట్‌ఫ్లిక్స్‌ని ముందుగా యాక్టివేట్ చేశామో.. ఆ వైఫై పరిధిలో మాత్రమే ఆ అకౌంట్ రన్ అవుతుంది. మిగతా చోట్ల డి-ఆక్టివేట్ అవుతుంది. అంటే ఇకపై నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడాలంటే ఏ వైఫై పరిధిలో యాక్టివేట్ చేసుకున్నామో అక్కడే చూడాల్సి ఉంటుంది. లేదా అకౌంట్ హోల్డర్ ఇతర ప్రాంతాలకు వెళ్తే టెంపరరీగా అక్కడ కొద్ది రోజుల పాటు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ని వాడుకునే అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఇండియాలో బడ్జెట్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లు పెరుగుతారని సంస్థ భావిస్తుంది. అంతేకాకుండా కొద్ది నెలల్లో హై-క్వాలిటీతో మరొక బడ్జెట్ ప్లాన్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్.