AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Auto Ram Prasad: మెగాఫోన్ పట్టనున్నమరో జబర్దస్త్ నటుడు.. దర్శకుడిగా ఆటో రాంప్రసాద్! హీరో ఎవరంటే?

షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. త్వరలోనే ధన రాజ్ రామం రాఘవం సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. వీరితో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేశ్, రాకెట్ రాఘవ.. ఇలా చాలామంది సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు.

Jabardasth Auto Ram Prasad: మెగాఫోన్ పట్టనున్నమరో జబర్దస్త్ నటుడు.. దర్శకుడిగా ఆటో రాంప్రసాద్! హీరో ఎవరంటే?
Jabardasth Auto Ram Prasad
Basha Shek
|

Updated on: May 23, 2024 | 9:42 PM

Share

ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో కారణంగానే ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోలు, నటులుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ యాక్టర్లుగా, టెక్నీషియన్లుగా.. ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు సత్తా చాటుతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. త్వరలోనే ధన రాజ్ రామం రాఘవం సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. వీరితో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేశ్, రాకెట్ రాఘవ.. ఇలా చాలామంది సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. అయితే వేణు, ధనరాజ్ తరహాలోనే మరో జబర్దస్త్ కమెడియన్ మెగా ఫోన్ పట్టనున్నాడు. తన దైన ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఆటో రామ్ ప్రసాద్ త్వరలోనే డైరెక్టర్ గా మారనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాం ప్రసాద్.. ఈ ముగ్గురూ కలిసి జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ఆన్ స్రీన్‌లోనే కాదు రియల్ లైఫ్ లోనూ వీరు ముగ్గురు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తోన్న సుధీర్, గెటప్ శీనులను హీరోలుగా పెట్టి ఓ సినిమా తీయనున్నాడట ఆటో రాం ప్రసాద్. ఓ మంచి కామెడీ ఎంటర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాం ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సుడిగాలి సుధీర్, గెటప్ శీనులతో సినిమా ప్లాన్ చేస్తోన్న రామ్ ప్రసాద్..

కాగా గెటప్ శీను హీరోగా నటించిన రాజూ యాదవ్ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి కూడా ప్రమోషన్ చేయడం గెటప్ శీను సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజు యాదవ్ ప్రమోషన్లలో సుడిగాలి సుధీర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.