- Telugu News Photo Gallery Cinema photos Guess The Celebrity In This Photo With Jr.NTR, She Is Director Prashanth Neel Wife Likitha Reddy
Jr.NTR: ఎన్టీఆర్‌తో ఇంత చనువుగా ఈమెని గుర్తుపట్టండి చూద్దాం! పాన్ ఇండియా డైరెక్టర్ సతీమణి
న్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ముఖ్యంగా అభిమానులు రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒకామె పై ఫొటోను పోస్ట్ చేసి తారక్ కు విషెస్ చెప్పింది. ఆమె ఎవరో తెలుసా?
Updated on: May 22, 2024 | 9:54 PM

ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ముఖ్యంగా అభిమానులు రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒకామె పై ఫొటోను పోస్ట్ చేసి తారక్ కు విషెస్ చెప్పింది. ఆమె ఎవరో తెలుసా?

పై ఫొటోలో ఎన్టీఆర్ తో చనువుగా ఉన్నది మరెవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి. ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు.

ప్రశాంత్ నీల్ ఇంటికి వెళ్లిన సమయంలో అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది. ఇప్పుడీ పిక్ నే మరోసారి షేర్ చేసి ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది లిఖితా రెడ్డి.

తెలుగు మూలాలున్న లిఖితాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. అతని సినిమాలు చూస్తూనే పెరిగిందట. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో ఇంటికి వచ్చేసరికి ఇలా ఆనందం తట్టుకోలేకపోయిందట.

ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.




