Pushpa: పుష్ప త్రీ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉందా ?? సుకుమార్ ఏమన్నారంటే ??
వారం అంతా పనిచేస్తేనే నెక్స్ట్ రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుందా? అని వెయిట్ చేస్తుంటాం. అలాంటిది నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్నారు సుకుమార్. ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. మాస్టర్ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారా? అని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఆ డీటైల్స్ చూసేద్దాం రండి... అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Updated on: May 23, 2024 | 9:22 AM

వారం అంతా పనిచేస్తేనే నెక్స్ట్ రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుందా? అని వెయిట్ చేస్తుంటాం. అలాంటిది నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్నారు సుకుమార్. ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. మాస్టర్ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారా? అని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఆ డీటైల్స్ చూసేద్దాం రండి...

అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు తీస్తున్న ఫాహద్ ఫాజిల్ సన్నివేశాలతో పాటు, ఓ పాటను చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.

ఆర్టిస్టులు కాస్త రిలీఫ్ కావచ్చు కానీ, ఆగస్టు 15న థియేటర్లలోకి సినిమాను తీసుకొచ్చేవరకు సుకుమార్‌కి మాత్రం రెస్ట్ ఉండదు. ఈ సినిమా తర్వాత ఆయన పుష్ప3 పనులు మొదలుపెడతారా? లేకుంటే ఇంకో హీరోతో ట్రావెల్ అవుతారా? అనేది ఆసక్తికరమైన విషయం.

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేయాలి. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు. ఆ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్‌కీ ఎక్కువ టైమ్ కేటాయించాల్సిందే.

పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. అయిపోయిన పార్ట్ , అయిపోయినట్టుగానే ఎడిట్ టేబుల్‌కి వచ్చేస్తోంది. రషెస్ చూసుకున్న వెంటనే నిర్మాణానంతర పనులను స్టార్ట్ చేసేస్తున్నారు టీమ్.




