AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్స్ బీ అలర్ట్.. బయటకు రాకండి.. అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ..

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై భారత రాయబార కార్యాలయాలు కీలక అడ్వైజరీలు జారీ చేశాయి. ఆయా దేశాల్లోని మన పౌరులు ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు తెలుసుకుందాం

ఇండియన్స్ బీ అలర్ట్.. బయటకు రాకండి.. అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ..
India Alerts Citizens In Israel, Iran And Gulf Countries
Krishna S
|

Updated on: Feb 28, 2026 | 6:00 PM

Share

ఓ వైపు ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌పై ఎటాక్ చేస్తే.. ఇరాన్ కూడా అందుకు ధీటుగా బదులిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న గల్ఫ్‌ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికా బేస్ క్యాంపులు ఉన్న బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఇరాక్‌పై ఏకకాలంలో మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా గల్ఫ్‌ మొత్తం యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇజ్రాయెల్‌లోని భారతీయులకు..

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని భారతీయులకు గట్టిగా సూచించారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసరమైన ప్రయాణాలను పూర్తిగా నివారించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించానలి కోరింది.

ఇరాన్‌లో అలర్ట్..

ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. అనవసరమైన ప్రయాణాలను, కదలికలను పూర్తిగా నివారించాలని సూచించింది. ‘‘ఎప్పటికప్పుడు తాజా వార్తలను గమనిస్తూ, పరిస్థితులపై అవగాహనతో ఉండాలి. రాయబార కార్యాలయం జారీ చేసే తదుపరి సూచనల కోసం వేచి ఉండాలి. ఏదైనా అత్యవసర సహాయం కోసం తమను సంప్రదించాలి’’ అని స్పష్టం చేసింది.

కువైట్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయులందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రతా మార్గదర్శకాలను, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కార్యాలయం తెలిపింది. భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని, తదుపరి అప్‌డేట్‌ల కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని కోరింది.

ఖతార్

ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సలహా ఇచ్చింది. రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు జారీ చేసే వార్తలు, సలహాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని.. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తమను సంప్రదించాలని కోరింది.

అంతేకాకుండా అబుదాబి, జోర్డాన్, పాలస్తీనా, యూఏఈ దేశాల్లో ఉన్న ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు స్పష్టం చేశాయి.

Follow Us
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
రింకు తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్?
రింకు తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్?