Hyderabad: అడ్డుకుంటే తొక్కుకుంటూ పోతాం! ఐటీ హబ్‌లో రెచ్చిపోయిన కారు రేసర్లు
హైదరాబాద్ మహానగరంలో కారు రేసర్లు బీభత్సం సృష్టించారు. ఐటీ హబ్ హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్ పరిసరాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటి గంట సమయంలో కొందరు యువకులు ఖరీదైన కార్లతో రోడ్లపై ప్రమాదకరంగా రేసింగ్‌కు దిగారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేసర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే, పోలీసులను చూసి కూడా ఆగని రేసర్లు, ఏకంగా వారిపైకే కారును వేగంగా దూసించుకుంటూ వెళ్లారు. ఈ ప్రమాదం నుంచి పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. ఛేజ్ చేసిన పోలీసులు చాకచక్యంగా ఒక రేసర్‌ను పట్టుకోగా, మిగిలిన వారు కార్లతో పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!
అమ్మబాబోయ్.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..