AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెటర్ బుమ్రా కు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఎంతవారలైనా తప్పులు చేయడం సహజం. ముఖ్యంగా పెద్ద జనసందోహంలో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి పొరబాటున తప్పులు దొర్లుతుంటాయి. అలాంటి తప్పిదమే పెద్ది మువీ ఈవెంట్లోనూ జరిగింది. హీరో రామ్‌ చరణ్‌ ప్రముఖ క్రికెటర్‌ బూమ్రా గురంచి పొరబాటున వ్యాఖ్యానించారు. దీంతో అదికాస్త నెట్టింట వైరల్‌ అయింది. వెంటనే స్పందించిన రామ్‌ చరణ్‌ తన తప్పును ఎంతో హుందాగా సరిదిద్దుకున్నారు. అసలేం జరిగిందంటే..

క్రికెటర్ బుమ్రా కు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Actor Ram Charan Apologises To Jasprit Bumrah
Srilakshmi C
|

Updated on: May 24, 2026 | 12:02 PM

Share

స్టార్ హీరో రామ్‌చరణ్‌ కొత్త మువీ ‘పెద్ది’ భారీ యాక్షన్ డ్రామాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర బృందం దేశ వ్యాప్తంగా జోరుగా ప్రొమోషన్స్‌ కొనసాగిస్తుంది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట లైవ్ కాన్సర్ట్ గ్రాండ్‌గా జరిపింది. అయితే ఈ ఈవెంట్‌లో వేదికపై క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ హోస్ట్‌ ర్యాపిడ్‌ఫైర్‌ నిర్వహించారు. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌ కాస్త తడబడి చేసిన ఓ కామెంట్‌ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఏం జరిగిందంటే..

ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఇంటరాక్షన్ సెషన్‌లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు ఇచ్చారు. స్టార్ క్రికెటర్ల పేరు చెబుతూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలని హోస్ట్‌ కోరారు. అలా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి అడిగారు. ఈ వరుసలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు కూడా అడిగారు. ఇందుకు చరణ్‌ సమాధానం చెబుతూ.. జస్‌ప్రీత్‌ బుమ్రాకు తాను మంచి అభిమానిని అని చెప్పి, ఆయన్ను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ క్షణాల్లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై స్పందించిన రామ్‌చరణ్‌ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

బుమ్రాను ట్యాగ్‌ చేస్తూ.. తాను కొన్నిసార్లు పేర్లను మర్చిపోతుంటానని, జనసందోహం, హంగామా మధ్య అనుకోకుండా పొరపాటు జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. మైదానంలో బుమ్రా విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని, ఆయన్ను ఎంతో గౌరవిస్తానన్నారు. ఆయన ఆటకు తాను పెద్ద అభిమానినని తన పోస్టులో కొనియాడారు. కాగా దీనిపై వెంటనే స్పందించిన  రామ్‌ చరణ్‌ తన పొరబాటును హుందాగా అంగీకరించిన తీరు అభిమానుల ప్రశంసలను అందుకుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us