అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్..
Rajeev
24 May 2026
instagram
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాగార్జున హీరోగానే కాదు ఇటీవల విలన్ గా మారి సినిమాలు చేస్తున్నారు.
హీరోగా రాణిస్తున్న నాగ్. పలు మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటించారు నాగార్జున. ఈ క్రమంలోనే ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమాలోనూ నటించారు నాగార్జున.
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో విలన్ గా నటించారు నాగ్. ఈ సినిమాలో నాగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఇక ఇప్పుడు తన 100వ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున.. కాగా ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
అలాగే అక్కినేని నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తండేల్ సినిమాతో హిట్ అందుకున్న చైతన్య.. ఇప్పుడు వృషకర్మతో రానున్నాడు.
అలాగే అక్కినేని అఖిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే లెనిన్ సినిమాతో రానున్నాడు అఖిల్.
అయితే నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ తో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పూజాహెగ్డే. చైతన్య, అఖిల్ తో హీరోయిన్ గా చేసిన పూజా.. నాగ్ తో ఓ యాడ్ లో నటించింది.