AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు అలర్ట్‌.. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి! కీలక మార్పులు!

కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఆదాయపు పన్ను నియమాలు 2026తో పాన్‌ వినియోగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని లావాదేవీలకు పాన్‌ అవసరాన్ని సడలించగా, భారీ విలువ గల ఆస్తి, బీమా, స్టాంప్‌ పేపర్‌ లావాదేవీలపై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

SN Pasha
|

Updated on: May 24, 2026 | 9:20 AM

Share
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఆదాయపు పన్ను నియమాలు 2026తో పాన్‌ కార్డు వినియోగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని లావాదేవీల్లో పాన్‌ నంబర్‌ తప్పనిసరి నిబంధనలను సడలించగా, మరికొన్నింటిలో పరిమితులను పెంచారు. అలాగే పాన్‌ లేని వారి కోసం ఉపయోగించే ఫారం 60 స్థానంలో ఇప్పుడు కొత్తగా ఫారం 97ను ప్రవేశపెట్టారు.

1 / 5
ఇప్పటి వరకు ఒకే రోజులో రూ.50,000కు మించిన నగదు డిపాజిట్‌లపై పాన్‌ నంబర్‌ ఇవ్వడం తప్పనిసరి ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఆ అవసరాన్ని తొలగించారు. దీంతో చిన్న, మధ్య తరహా లావాదేవీల్లో పాన్‌ చూపించాల్సిన ఒత్తిడి కొంత తగ్గనుంది.

2 / 5
అయితే మరోవైపు కొన్ని కొత్త లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది. నిపుణుల ప్రకారం, స్టాంప్‌ పేపర్‌ కొనుగోళ్లు, భారీ బీమా ప్రీమియం చెల్లింపులు, అధిక విలువ గల స్థిరాస్తి లావాదేవీలు ఇకపై తప్పనిసరిగా నివేదించాల్సి ఉంటుంది. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.2 లక్షలకు మించిన స్టాంప్‌ పేపర్‌ కొనుగోళ్లు, రూ.5 లక్షలకు మించిన బీమా ప్రీమియం చెల్లింపులు ప్రత్యేకంగా పన్ను శాఖ దృష్టిలోకి రానున్నాయి.

3 / 5
స్థిరాస్తి రంగంలో కూడా కీలక మార్పులు చేశారు. బహుమతులు, జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు (JDA) సహా రూ.45 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు ఇకపై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. ఇంతకు ముందు ఫారం 60 సమర్పించి ఇలాంటి లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఫారం 97 అమల్లోకి రావడంతో, కంపెనీలు లేదా సంస్థలు కాకుండా వ్యక్తిగతంగా ఆస్తి కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా పాన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

4 / 5
కొత్త నిబంధనలతో పాన్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం కాకుండా, అధిక విలువ గల లావాదేవీలపై మరింత పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పన్ను ఎగవేతను అరికట్టడం, డిజిటల్‌ ట్రాకింగ్‌ను బలోపేతం చేయడం కోసం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర