RCB vs RR, IPL 2024: ఈ సాలా కప్ నహీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి.. భారంగా ఇంటి బాట పట్టిన కోహ్లీ టీమ్
Royal Challengers Bangalore Vs Rajasthan Royals: ఆర్సీబీ కల చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది.
Royal Challengers Bangalore Vs Rajasthan Royals: ఆర్సీబీ కల చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (34) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45), పరాగ్ (36), హెట్‌మయర్ (26) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ ఫైనల్ బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
All is 𝙒𝙚𝙡𝙡 when Po𝙒𝙚𝙡𝙡 is there 😎
Rajasthan Royals ease out the nerves with a 4️⃣ wicket victory 🩷
With that, they move forward in the quest for glory 🙌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/brrzI8Q3sZ
— IndianPremierLeague (@IPL) May 22, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, నాంద్రే బర్గర్, షిమ్రాన్ హెట్మేయర్, తనుష్ కోటియన్
𝗗𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝗱! 🫣
Captain Sanju Samson is stumped off a wide delivery ☝️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/e0G6MhVu18
— IndianPremierLeague (@IPL) May 22, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..