Maidaan OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవ్‌గణ్ మైదాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్ఆర్ఆర్ ఫేమ్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా అమిత్ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్’. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామాకు మంచి స్పందనే వచ్చింది.
ఆర్ఆర్ఆర్ ఫేమ్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా అమిత్ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్’. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామాకు మంచి స్పందనే వచ్చింది. కథ, కథనాలతో పాటు అజయ్‌దేవ్‌గణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ రోటీన్ అవ్వడంతో మైదాన్ సినిమాకు అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా కారణంగా నిర్మాతలకు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ అందుకున్న మైదాన్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అజయ్ దేవ్ గణ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన, సమాచారం లేకుండా బుధవారం (మే22) ఓటీటీలోకి వచ్చేసిందీ స్పోర్ట్స్ బయోపిక్. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది ఓటీటీ సంస్థ. ప్రస్తుతానికి ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో మైదాన్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా చూడాలంటే రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూన్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికి మైదాన్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
జీ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ మైదాన్ మూవీని నిర్మించాడు. ఇందుకు సుమారు రూ.230 కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో గజ్రజ్ రావ్, దేవ్యాంష్ త్రిపాఠి, రిషబ్ జోషి, మీనాల్ పటేల్, రుద్రీనీల్ ఘోష్, జహీర్ మీర్జా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానిక వస్తే.. 1950 దశకంలో భారత ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా రహీమ్ (అజయ్ దేవ్‌గణ్) నియమితుడవుతాడు. కానీ ఈ ఆటలో బెంగాళీలదే ఆధిపత్యం కావడంతో రహీమ్ కోచ్‌గా ఎంపికవ్వడం నచ్చని కొందరు కుట్రలు పన్నుతారు. రహీమ్ కోచ్ పదవి పోయేలా చేస్తారు. మరి ఈ సమస్యలను రహీమ్ ఎలా అధిగమించాడు? అతని మార్గదర్శకత్వంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో ఎలా పతకం గెలిచింది అన్నదే మైదాన్ మూవీ కథ
Hindi film #Maidaan is now available on rent on Amazon Prime Video Store.
It will stream without rent from June 5th. pic.twitter.com/fkQ9mS4M1h
— Streaming Updates (@OTTSandeep) May 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.