T20 World Cup 2024: సంజూశామ్సన్ కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత తుది జట్టు ఇదే
జూన్ 1 నుంచి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కంచుకోవాలని టీమిండియా భావిస్తోంది
జూన్ 1 నుంచి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచకప్ టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీమ్ ఇండియా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని విడుదల చేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్. ఈసారి యువరాజ్ సింగ్ ఐసిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో టి 20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చెప్పాడు. ఇందులో హార్దిక్ పాండ్యా కు స్థానం కల్పించిన యువీ.. ‘ఐపీఎల్‌లో హార్దిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ టీ20 ప్రపంచకప్‌లో అతను రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది. అతని బౌలింగ్ సామర్థ్యం ఫిట్‌నెస్ రెండూ ముఖ్యమైనవి’ అని అన్నాడు. ఇంకా ఏమిటంటే, యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయాలని సిక్సర్ల కింగ్ చెప్పాడు.
రోహిత్, యశస్విలు టీ20 ప్రపంచకప్‌కు ఓపెనింగ్ చేయాలని భావిస్తున్నాను. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలవాలి. సూర్యకుమార్ యాదవ్‌ని నాలుగో నంబర్‌లో పంపవచ్చు. నేను రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లో వెళతాను. ఇది ప్రత్యర్థి బౌలింగ్‌ను కష్టతరం చేస్తుందని యువరాజ్ సింగ్ అన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ అనే ప్రశ్నకు కూడా అతను సమాధానం ఇచ్చాడు. “నేను ప్లేయింగ్ XIలో రిషబ్ పంత్‌ని తీసుకుంటాను. సంజు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం. నా అభిప్రాయం ప్రకారం, రిషబ్‌కు భారత్‌కు మ్యాచ్ గెలిచే సత్తా ఎక్కువ. గతంలోనూ చేశాడు. అలాంటి ఆటగాడే పెద్ద స్థాయిలో మ్యాచ్ విన్నర్ అవుతాడు’ అని యువరాజ్ సింగ్ అన్నాడు.
‘యుజువేంద్ర చాహల్‌ను జట్టులో చూడడం ఆనందంగా ఉంది. ఎందుకంటే అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ రెండో భాగంలో పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో కొన్ని ఎంపికలు ఉండటం అవసరం. మాకు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. కాబట్టి ఇది నిజానికి బలమైన జట్టు. కానీ మనం దానిని నిరూపించుకోవాలి’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
Not Sanju Samson, Yuvraj Singh picks Rishabh Pant as India’s wk for T20 World Cup 2024
“I’d probably go for Rishabh. Obviously Sanju is also in great form, but Rishabh is lefty and I believe that Rishabh has massive potential to win games for India, which he has done in the past pic.twitter.com/ZPrVqq4mmw
— Kandy G (@Kandy_G_) May 22, 2024
యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..