RCB vs RR, IPL 2024: రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
Royal Challengers Bangalore Vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ ( మే22) రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
Royal Challengers Bangalore Vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ ( మే22) రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో ఓడిన జట్టు నేరుగా ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకుంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు పరాజయాలను ఎదుర్కోంది. అలాగే లీగ్ రౌండ్ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం పడి ఈ మ్యాచ్ రద్దు అయితే , క్వాలిఫయర్ 2 టిక్కెట్ రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్తుంది. ఎందుకంటే రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇత గత రికార్డుల విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 13 సార్లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
🚨 Toss Update 🚨
Rajasthan Royals elect to bowl against Royal Challengers Bengaluru.
Follow the Match ▶️ https://t.co/b5YGTn6RZd#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/7zReTDiYP8
— IndianPremierLeague (@IPL) May 22, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, నాంద్రే బర్గర్, షిమ్రాన్ హెట్మేయర్, తనుష్ కోటియన్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..