Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఆస్పత్రిలో షారుక్‌ ఖాన్‌.. అభిమానుల్లో ఆందోళన.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ లో భాగంగా మంళవారం (మే 21) జరిగిన కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌కు షారుఖ్ హాజరయ్యారు. మైదానంలో అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. అయితే బుధవారం (మే 22) షారుఖ్ అనారోగ్యానికి గురయ్యాడు.

Shah Rukh Khan: ఆస్పత్రిలో షారుక్‌ ఖాన్‌.. అభిమానుల్లో ఆందోళన.. అసలేం జరిగిందంటే?
Bollywood Actor Shah Rukh Khan
Follow us
Basha Shek

|

Updated on: May 22, 2024 | 8:20 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ లో భాగంగా మంళవారం (మే 21) జరిగిన కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌కు షారుఖ్ హాజరయ్యారు. మైదానంలో అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. అయితే బుధవారం (మే 22) షారుఖ్ అనారోగ్యానికి గురయ్యాడు. గుజరాత్ తో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండడంతో షారుక్ డీహైడ్రేషన్/ వడదెబ్బ బారిన పడ్డాడు. ఈ కారణంగానే ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరారు. అయితే కింగ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందనిసమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. షారుఖ్ వెంట భార్య గౌరీ ఖాన్, మేనేజర్ పూజతో పాటు జుహీ చావ్లా కూడా ఉన్నారు. ‘షారుక్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోంది. అయితే, కింగ్ ఖాన్‌కు చికిత్స కొనసాగుతోంది. డీహైడ్రేషన్ పాటు దగ్గు కూడా ఉండడంతో వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచారు. అహ్మదాబాద్‌లో చాలా వేడిగా ఉంది. ఈరోజు కూడా దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కింగ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది’ అని షారుఖ్ సన్నిహితుడొకరు చెప్పుకొచ్చారు.మరోవైపు షారుక్‌ఖాన్‌ అడ్మిట్ తో కేడీ ఆస్పత్రికి పోలీసులు భద్రతను పెంచారు.

ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగింది. ఇందులో షారుక్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. జట్టు అద్భుతమైన ప్రదర్శనతో షారుక్ చాలా సంతోషంగా కనిపించాడు. మ్యాచ్ అనంతరం మైదానంలో ఆటగాళ్లతో కూడా కనిపించాడు. అనంతరం నరేంద్ర మోదీ స్టేడియంకు చేరుకున్న వేలాది మంది మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొడుకు అబ్రామ్, కూతురు సుహానాతో కలిసి షారుక్ ఖాన్ గ్రౌండ్ మొత్తం చుట్టి అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇర మూడో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కింగ్ ఖాన్ జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.