కోల్‌కతా నైట్ రైడర్స్
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి కానప్పటికీ, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా చాలా ప్రజాదరణ పొందింది. అందుకు ఒకే ఒక కారణం ఉంది. కోల్‌కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ (Shah Rukh Khan). ఈడెన్‌లో అతనిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. అతను తన మద్దతుదారులను కూడా నిరాశపరచడు. కింగ్ ఖాన్ ఐపీఎల్ సమయంలో కోల్‌కతాకు క్రమం తప్పకుండా వస్తుంటాడు. షారుఖ్ కారణంగా KKRకి స్పాన్సర్ల కొరత లేదు. ట్రోఫీ విషయంలో అంతగా విజయం సాధించకపోయినా, కేకేఆర్ జట్టు బిజినెస్ పరంగా భారీ విజయాన్ని సాధించింది. ఆర్‌సీబీ, సీఎస్‌కే, ముంబైతో మొదటి నుంచి పోటీ పడుతుంది.
మైదానం వెలుపల మాదిరిగానే, మైదానంలో కూడా KKR ప్రజాదరణ బలంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో సౌరవ్ గంగూలీ నైట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా KKR ప్రజాదరణ మొదటి నుంచి విపరీతంగా పెరిగింది. అయితే, KKR మొదటి IPL ట్రోఫీని గెలుచుకోవడానికి చాలా సమయం పట్టింది. 2012లో, గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మొదటి టైటిల్‌ను గెలిపించాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేకేఆర్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ సమయంలో కెప్టెన్‌గా గంభీర్ ఉన్నాడు. రెండుసార్లు కోల్‌కతా టైటిల్‌ను గెలుచుకున్న కెప్టెన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే మరో పాత్రలో. ఆయన మెంటార్‌గా కనిపించనున్నారు. గంభీర్ టచ్ తో కేకేఆర్ మళ్లీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని కలలు కంటోంది. 10 సంవత్సరాల తర్వాత, KKR లో ట్రోఫీ కరువు ముగుస్తుందా లేదా అనేది చూడాలి