Video: 8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో విధ్వంసం.. ఐపీఎల్ 2026కి ముందే కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
Finn Allen KKR IPL 2026 auction:ఫిన్ అలెన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ బిబిఎల్ సీజన్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. అతని విధ్వంసకర బ్యాటింగ్ చూస్తుంటే రాబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు అతను ప్రధాన ఆయుధం కావడం ఖాయం.

Finn Allen 101 off 53 Balls BBL: బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గురువారం (జనవరి 15) మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అలెన్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్, ఫిన్ అలెన్ సెంచరీ (101 పరుగులు, 53 బంతులు) పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అలెన్ ఇన్నింగ్స్ హైలైట్స్: ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ ఆరంభం నుండి ఎటాకింగ్ మూడ్‌లో కనిపించాడు.
సిక్సర్ల వర్షం: తన ఇన్నింగ్స్‌లో అలెన్ మొత్తం 8 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు.
వేగవంతమైన సెంచరీ: కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇది బిబిఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌గా నిలిచింది.
Finn Allen hits three sixes in a row, each one bigger than the last! 😱 #BBL15 pic.twitter.com/icslj60jzX
— KFC Big Bash League (@BBL) January 15, 2026
స్ట్రైక్ రేట్: దాదాపు 190.57 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మెల్బోర్న్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
రెనెగేడ్స్ వైఫల్యం: 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 169 పరుగులకే పరిమితమైంది. దీంతో పెర్త్ స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్లేఆఫ్స్ దిశగా అడుగులు వేసింది. రెనెగేడ్స్ జట్టులో టిమ్ సీఫెర్ట్ (66) మరియు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (42) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.
ఐపీఎల్ కనెక్షన్: ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో ఫిన్ అలెన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అలెన్ ఇలా ఫామ్‌లోకి రావడం కేకేఆర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




