AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR : షారుఖ్ టీం వెనుక ఇంత పెద్ద సామ్రాజ్యం ఉందా? కేకేఆర్ యజమానుల ఆస్తి చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (KRSPL) నిర్వహిస్తోంది. ఇందులో షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‎కు 55% వాటా ఉండగా, మిగిలిన 45% వాటా బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త జయ్ మెహతాలకు ఉంది.

KKR : షారుఖ్ టీం వెనుక ఇంత పెద్ద  సామ్రాజ్యం ఉందా? కేకేఆర్ యజమానుల ఆస్తి చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
Kkr Shah Rukh Khan
Rakesh
|

Updated on: Jan 05, 2026 | 4:47 PM

Share

KKR : ఐపీఎల్‎లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. కేకేఆర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అయితే ఈ జట్టుకు షారుఖ్ ఒక్కడే యజమాని కాదు. ఆయనతో పాటు మరో ప్రముఖ జంటకు కూడా ఈ ఫ్రాంచైజీలో భారీ వాటా ఉంది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నియామకం చుట్టూ జరిగిన వివాదంతో కేకేఆర్ యజమానుల వివరాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.

కేకేఆర్ అసలు యజమానులు ఎవరు?

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (KRSPL) నిర్వహిస్తోంది. ఇందులో షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‎కు 55% వాటా ఉండగా, మిగిలిన 45% వాటా బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త జయ్ మెహతాలకు ఉంది. 2008లో కేవలం రూ.623 కోట్లకు కొనుగోలు చేసిన ఈ జట్టు విలువ ఇప్పుడు ఏకంగా రూ.9,139 కోట్లకు (సుమారు 1.1 బిలియన్ డాలర్లు) చేరడం విశేషం.

హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్నమైన నటిగా నిలిచారు. ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ.7,790 కోట్లు. గత ఏడాది (2024) ఇది రూ.4,600 కోట్లుగా ఉండగా, కేవలం ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద భారీగా పెరిగింది. కేకేఆర్ జట్టుతో పాటు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుల్లో జూహీ కూడా ఒకరు. అలాగే రియల్ ఎస్టేట్, సిమెంట్ రంగాల్లో ఆమెకు భారీ పెట్టుబడులు ఉన్నాయి.

జూహీ చావ్లా భర్త జయ్ మెహతా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన మెహతా గ్రూప్ అధినేత. ఆయన వ్యక్తిగత ఆస్తి సుమారు రూ.2,400 కోట్లు కాగా, ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ $2.1 బిలియన్ల (సుమారు రూ.17,555 కోట్లు) పైమాటే. ఈ జంటకు విదేశాల్లో కూడా పలు క్రికెట్ ఫ్రాంచైజీలు (ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్) ఉన్నాయి.

ముస్తాఫిజుర్ వివాదం

ఐపీఎల్ 2026 వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంలో షారుఖ్‌తో పాటు జయ్ మెహతా, జూహీ చావ్లా కూడా కీలక పాత్ర పోషించారు.