ఆనాడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని మంత్రులుగా చేసిన వైనాన్ని, బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్రను ఆమె గుర్తు చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను మంత్రి సీతక్క గట్టిగా తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆమె అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని మంత్రులుగా చేసిందని సీతక్క గుర్తు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని, 2018 తర్వాత దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన సీతక్క, కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపైనా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు, దాదాపు 10-11 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్ బుకింగ్.. భార్యను చంపిన భర్త అరెస్ట్
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

