సైజ్ జీరో తర్వాత అనుష్క శెట్టి కెరీర్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఘాటీ చిత్రం నిరాశపరచడంతో అనుష్క సినిమాలకు గుడ్‌బై చెబుతారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే, అన్ని అనుమానాలకు తెరదించుతూ, అనుష్క కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.