AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచేసేవారికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్ల మంజూరుపై కీలక ప్రకటన వచ్చింది. చాలామంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందా అని నిరిక్షిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం పంపిణీకి సిద్దమైంది.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..
Indiramma Houses Scheme
Venkatrao Lella
|

Updated on: Mar 12, 2026 | 4:44 PM

Share

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో లక్షలాది మంది కొత్త ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్నారు. తొలి జాబితాలో 3.50 లక్షల మందికి ఇళ్లను పంపిణీ చేయగా.. రెండో విడతలో మరికొంతమంది అర్హులకు ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. రెండో జాబితాపై అధికారులు కసరత్తు పూర్తి చేయగా.. విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇళ్లను ఎప్పుడూ విడుదల చేస్తామనేది చెప్పేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

రెండో జాబితా అప్పుడే..

ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంబచరల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో మంజూరు చేసిన ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే త్వరతగతిన ఇళ్లను పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే కొన్ని కారణాలతో కొంతమంది లబ్దిదారులుకు  అకౌంట్లలో ఆర్ధిక సాయం జమ కావడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని, అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోకే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

రూ.5 లక్షల ఆర్ధిక సాయం

రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు స్థలం కలిగి ఉంటే ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇళ్లను నిర్మించుకునేందుకు ఏకంగా రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. విడతల వారీగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దశలను బట్టి అందిస్తోంది. ప్రతీవారం లబ్దిదారులకు వీటిని జమ చేస్తుండటం వల్ల ఇళ్ల నిర్మాణాల్లో వేగం కూడా పెరుగుతోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలుకానున్న ఏప్రిల్‌లో రెండో జాబితా విడుదల చేయనుండటంతో.. దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. తమకు ఇళ్లు మంజూరు అవుతుందా.. లేదా అనే దానిపై ఆందోళన పడుతున్నారు. తొలి విడతలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇళ్లను అందించగా.. ఈ సారి పట్టణ, నగర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లను కేటాయించనుందని తెలుస్తోంది. అలాగే స్థలం లేనివారికి కూడా సమీపంలోనే ఇళ్ల సముదాయలను ప్రభుత్వం నిర్మించి వాటిని పంపణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను అధికారులు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు.

Follow Us