AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్ బి12 కోసం ట్యాబ్లెట్లు వద్దు.. ఇలాంటి ప్రకృతి చిట్కాలు పాటించారంటే మీ ఆరోగ్యం బంగారమే..!

విటమిన్ బి12 అనేది నరాల ఆరోగ్యం, రక్త కణాల తయారీకి చాలా అవసరం. అలాగే కండరాల బలం పెంచి మీకు శక్తిని అందించడంలో విటమిన్ బి12 సహాయపడుతుంది. బి12 అనేది బయటి నుండి వచ్చేది మాత్రమే కాదు, మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ద్వారా తయారయ్యేది. అలాంటి విటమిన్ బి12 కోసం రోజూ కొన్ని ఆహారాలు తింటే మంచిది. అవేంటో చూద్దాం.

విటమిన్ బి12 కోసం ట్యాబ్లెట్లు వద్దు.. ఇలాంటి ప్రకృతి చిట్కాలు పాటించారంటే మీ ఆరోగ్యం బంగారమే..!
Vitamin B12 Diet Tips
Jyothi Gadda
|

Updated on: Mar 12, 2026 | 4:39 PM

Share

ప్రస్తుత కాలంలో విటమిన్ బి12, విటమిన్ డి లోపాలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, వీటికి ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు తీసుకోవడం కేవలం ఒక వ్యాపారమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే శరీరమే సహజంగా ఈ విటమిన్లను తయారు చేసుకుంటుందని చెబుతున్నారు. వైద్యం అనేది వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో మన పూర్వీకులు అందించిన సాంప్రదాయ ఆహారమే మనల్ని కాపాడుతుందని సూచిస్తున్నారు. అందుకోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? నిపుణలు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

విటమిన్ బి12 అనేది నరాల ఆరోగ్యం, రక్త కణాల తయారీకి చాలా అవసరం. అలాగే కండరాల బలం పెంచి మీకు శక్తిని అందించడంలో విటమిన్ బి12 సహాయపడుతుంది. బి12 అనేది బయటి నుండి వచ్చేది మాత్రమే కాదు, మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ద్వారా తయారయ్యేది. మనం కొబ్బరి పాలు లేదా నువ్వుల పాలు తాగడం ద్వారా ఈ బ్యాక్టీరియాను వృద్ధి చేయవచ్చు. ముఖ్యంగా కొబ్బరి పాలతో చేసిన పెరుగును వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల బి12 లోపం తలెత్తదని నిపుణులు చెబుతున్నారు.

నువ్వులను మహత్వకరమైన పదార్థంగా ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒక నువ్వుల లడ్డు తినడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు దరిచేరవని అంటున్నారు. ఇది నువ్వుల గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. అలాగే నరాల బలహీనత, పార్కిన్సన్స్ వంటి సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెను వాడటం ద్వారా అద్భుత ఫలితాలు పొందవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, మన శరీరం, ఆరోగ్యానికి అన్ని రకాల విటమిన్లు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇందుకోసం సిరిధాన్యాల ఆహారం కూడా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో కొర్రలు, అరికెలు, సామలు వంటి సిరిధాన్యాలను గంజి రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, రాత్రిపూట చీకటి గదిలో నిద్రపోవడం వల్ల మెదడులో అవసరమైన రసాయనాలు ఉత్పత్తి అయ్యి గాఢ నిద్ర పడుతుంది. మునగాకు, రావి ఆకు, గరిక వంటి కషాయాలు తాగడం వల్ల పిసిఓడి, ఇతర దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు..!
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
దీంతో చేసిన బిర్యానీలు, చాక్లెట్లు హెల్తీ.. సీక్రెట్స్ ఇవే
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది..
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?