విటమిన్ D కోసం ఏ టైంలో, ఎంత సమయం ఎండలో ఉండాలో తెలిస్తే షాక్ అవుతారు
11-08-2026
Pic credit - Instagram
Phani Ch
భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా లభించినప్పటికీ, నగరాల్లో నివసించే వారిలో దాదాపు 70 శాతం మంది తీవ్రమైన విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పురుషుల కంటే మహిళల్లోనే విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలలో మరియు డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
మారిన జీవనశైలి కారణంగా ఎక్కువ సమయం ఇళ్లు, ఆఫీసులకే పరిమితమవ్వడం, బయటకు వెళ్లినప్పుడు శరీరం నిండా దుస్తులు ధరించడం వల్ల చర్మానికి తగినంత ఎండ తగలడం లేదు.
అంతేకాకుండా పెరుగుతున్న వాయు కాలుష్యం, గాజు కిటికీల వెనుక కూర్చవడం వంటివి సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందాల్సిన విటమిన్ డి ప్రక్రియను అడ్డుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మిలోని ‘యువిబి’ (UVB) కిరణాలు అవసరం. ఇవి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎక్కువగా లభిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి
ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య తీవ్రమైన ఎండలో కొద్ది సమయం ఉండటం మంచిది. అయితే చర్మ రక్షణ కోసం సన్‌స్క్రీన్, టోపీ మరియు కూలింగ్ గ్లాసెస్ వాడటం శ్రేయస్కరం.
నిరంతరం అలసట, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు, కండరాల బలహీనత మరియు నీరసంగా ఉండటం విటమిన్ డి లోప ప్రధాన లక్షణాలుగా భావించవచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాల ద్వారా మరియు వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.