ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్ తినరు..! షాకింగ్ వీడియో వైరల్
బయట రోడ్ల వెంట బండ్ల మీద లేదంటే, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులలో మనకు నోరూరించే ఎన్నో రకాల ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి. ఎన్నో రకాలైన నూనె పదార్థాలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ మనకు నోట్లో నీళ్లు ఊరేలా చేస్తాయి. సమోసా, పానీపూరీ, పాప్‌కార్న్ ఇలా లెక్కకు మించిన ఆహారాలు అమ్ముతుంటారు. దీంతో రోడ్డు మీదుగా వెళ్తున్నప్పుడు సహజంగానే వాటి వాసనకు ఆకర్షితులమవుతాం. ఆకలివేసినా లేదంటే, టైమ్ పాస్ కోసమో వాటిని కొని తింటాం. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూశారంటే.. ఇకపై బయట పాప్‌కార్న్ తినాలంటేనే బయపడిపోతారు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో బయట ఫుడ్ తినే వారి ఆరోగ్యంపట్ల ఆందోళన కలిగిస్తోంది. పరిశుభ్రతను పట్టించుకోని వీధి వ్యాపారుల పనితీరును బయటపెడుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. రోడ్డు పక్కన అమ్మే ఫుడ్ స్టాల్స్ తరచూ వాటి పరిశుభ్రత గురించి ప్రజల్లో అనేక సందేహాలను కలిగిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బయటి ఆహారంపై మీకు మరింత నమ్మకం కోల్పోయేలా చేస్తుంది ఈ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. కోపం, వ్యంగ్యం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలోని ఒక పట్టణంలో వీధి ఆహార పరిశుభ్రతపై చర్చకు దారితీసే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక పాప్‌కార్న్ విక్రేత మూత్ర విసర్జన చేసిన తరువాత చేతులు కడగకుండా అలాగే తిరిగి వచ్చి పాప్‌కార్న్ తయారు చేసి విక్రయించినట్లు అక్కడున్న వ్యక్తులు గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సాక్షుల ప్రకారం, ఆ వ్యాపారి తన స్టాల్‌ను కొద్దిసేపు వదిలి వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే అతను చేతులు కడగకుండానే వెంటనే పాప్‌కార్న్ గింజలను పట్టుకుని తయారీ ప్రక్రియ ప్రారంభించాడని తెలిపారు. అక్కడున్న కొంతమంది ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆహార పరిశుభ్రతపై మరోసారి చర్చ మొదలైంది.
వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, మూత్ర విసర్జన తర్వాత చేతులు కడగకపోతే బ్యాక్టీరియా, వైరస్‌లు ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీధి ఆహారం విక్రేతలు వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని వారు సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి ఆహారం తినే ముందు విక్రేతల పరిశుభ్రతను గమనించాలని కొందరు సూచిస్తున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు, ఆహార భద్రత విభాగం ఇలాంటి ఘటనలను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి వీధి ఆహార పరిశుభ్రతపై అవగాహన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




