AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!

బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం కాదు...మరీ గోల్డ్‌ క్యాపిటల్‌ సిటీగా పిలిచే ఆ నగరం ఏది..? ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
World Gold Capital
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2026 | 4:34 PM

Share

ప్రపంచంలో బంగారం అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది భారతదేశంలోని కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కానీ, గోల్డ్‌ క్యాపిటల్‌ సిటీ అంటే.. కర్ణాటక కాదు.. ఈ భూమిపై సగం బంగారం ఉత్పత్తి చేసే నగరం మరొకటి ఉంది. అదే ప్రపంచ బంగారు రాజధాని..ఇక్కడే ప్రపంచంలోని బంగారంలో దాదాపు 40శాతం ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో అసలైన గోల్డ్ క్యాపిటల్ గా గుర్తింపు పొందిన నగరం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్. ఒకప్పుడు ఈ నగరం భూమిపై లభించిన బంగారంలో దాదాపు సగానికి సమానమైన ఉత్పత్తిని అందించినట్లు చరిత్ర చెబుతోంది.

1886లో జోహన్నెస్‌బర్గ్ ప్రాంతంలోని విట్‌వాటర్‌స్రాండ్ ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి బంగారం తవ్వకాలలో పాల్గొన్నారు. ఈ సంఘటనతో జోహన్నెస్‌బర్గ్ చిన్న పట్టణం నుంచి వేగంగా అభివృద్ధి చెంది పెద్ద నగరంగా మారింది. విట్‌వాటర్‌స్రాండ్ బంగారు గనులు ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా ఉన్న గనులుగా గుర్తింపు పొందాయి. కొన్ని అంచనాల ప్రకారం, భూమిపై ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఈ ప్రాంతం నుంచే లభించిందని చెబుతారు. అందుకే జోహన్నెస్‌బర్గ్‌ను సిటీ ఆఫ్ గోల్డ్ లేదా వరల్డ్ గోల్డ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు.

ఈ గనుల వల్ల దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ లాభం కలిగింది. బంగారం తవ్వకాల కారణంగా అక్కడ పరిశ్రమలు, రవాణా, వ్యాపారం వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయి. జోహన్నెస్‌బర్గ్ త్వరగా దేశంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటిగా మారింది. అయితే బంగారం తవ్వకాలతో పాటు అనేక సమస్యలు కూడా తలెత్తాయి. గనుల్లో పనిచేసే కార్మికులు తీవ్రమైన శ్రమకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. అయినప్పటికీ, ఈ ప్రాంతం ప్రపంచ బంగారం చరిత్రలో ఒక కీలక స్థానం సంపాదించింది.

ఇవి కూడా చదవండి

జోహన్నెస్‌బర్గ్ అక్కడి గనులకు మాత్రమే కాకుండా దాని పచ్చదనానికి కూడా ప్రసిద్ధి చెందింది. 10 మిలియన్లకు పైగా చెట్లతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పట్టణ అడవిని కలిగి ఉంది. భూమిపై బంగారు నిల్వలలో దాదాపు సగం ఇప్పటికీ విట్వాటర్‌స్రాండ్ బేసిన్‌లో లోతుల్లో దాగి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లో పాత గనుల్లో చాలావరకు మూసివేయబడినా, ఈ నగరం ఇప్పటికీ ప్రపంచ బంగారం చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. బంగారం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల కథలు, గనుల చరిత్ర ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..