AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doomsday Fish: విపత్తు ముంచుకొస్తుందా? సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు..!

ఓర్‌ఫిష్‌లు సాధారంగా సముద్రంలో దాదాపు 900 మీటర్ల లోతులో జీవిస్తాయి. సూర్యకాంతి కూడా చేరని ప్రాంతంలోనే ఉంటాయి. ఇవి దాదాపు 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. పొడవైన రిబ్బన్‌లా కనిపిస్తాయి. వెండి రంగు శరీరం, తల నుంచి వెనుక భాగం వరకు ఎరుపు రంగు రెక్కలతో ఆకర్షణీయంగా ఉంటాయి.

Doomsday Fish: విపత్తు ముంచుకొస్తుందా? సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు..!
Doomsday Fish
Jyothi Gadda
|

Updated on: Mar 10, 2026 | 6:22 PM

Share

మెక్సికో తీర ప్రాంతంలో ఒక భారీ ఓర్‌ఫిష్ కనిపించడం ప్రజలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తించింది. ఈ పెద్ద చేప అసాధారణ ఆకారం, పొడవు, అరుదైన స్థితి కారణంగా దాన్ని డూమ్స్‌డే ఫిష్‌గా కూడా పిలుస్తున్నారు. సామాన్యంగా ఈ చేపలు లోతైన సముద్రంలో నివసిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చేప ఫోటోలు, వీడియోలు వేగంగా షేర్ అవుతున్నాయి. ఈ భారీ ఓర్‌ఫిష్ పొడవు సుమారు 5–6 మీటర్లు ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారు. దీని తెల్లని, లాటినెసెంట్ రంగు, స్లిమ్ పొడవైన శరీ, చిన్న దవడలు చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఈ డూమ్స్‌డే ఫిష్ అనేది పురాతన కాలంలో సముద్ర భయంకర సంఘటనలకు సంకేతంగా భావించబడింది. అందుకే, ప్రస్తుతం నెట్టింట ఈ ఫిష్‌ ఫోటోలు విస్తృత చర్చలకు దారి తీసింది.

మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ బీచ్ సమీపంలో అకస్మాత్తుగా ఒక రహస్యమైన లోతైన సముద్ర చేప కనిపించింది. ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వేల అడుగుల లోతులో నివసించే ఇలాంటి పొడవైన, మెరిసే చేప ఒడ్డుకు సమీపంలో ఈదుతూ కనిపించింది. ప్రజలు దానిని చూసిన వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అది వేగంగా వైరల్ అయింది. ఓర్‌ఫిష్‌లు సాధారంగా సముద్రంలో దాదాపు 900 మీటర్ల లోతులో జీవిస్తాయి. సూర్యకాంతి కూడా చేరని ప్రాంతంలోనే ఉంటాయి. ఇవి దాదాపు 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. పొడవైన రిబ్బన్‌లా కనిపిస్తాయి. వెండి రంగు శరీరం, తల నుంచి వెనుక భాగం వరకు ఎరుపు రంగు రెక్కలతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జపనీస్ జానపద కథల ప్రకారం..,ఈ డూమ్స్‌డే ఫిష్ సముద్రంలోంచి తీర ప్రాంతాలకు కొట్టుకొస్తే భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. అలాంటిది ఒకేసారి రెండు ఓర్‌ఫిష్‌లు రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ, ఓర్‌ఫిష్‌కు భూకంపాలకు మధ్య ఎలాంటి శాస్త్రీయ సంబంధం లేదని, ఈ నమ్మకాలను కేవలం అపోహలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

సముద్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓర్ ఫిష్ ఉపరితలంపైకి రావడం విపత్తుకు సంకేతం కాదు. ఈ చేప సాధారణంగా అనారోగ్యంతో, గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల పైకి కొట్టుకుపోయినప్పుడు ఉపరితలంపైకి వస్తుంది. అలాంటి సందర్భాల్లనే, సముద్రంలో రహస్యంగా ఉండే అరుదైన చేప కావటంతో ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. అందుకే, దీనిని గుర్తించినప్పుడల్లా సోషల్ మీడియా నుండి శాస్త్రీయ సమాజం వరకు ప్రతిచోటా చర్చను రేకెత్తిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us