AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త! భద్రత కోసం తప్పనిసరి చిట్కాలు

రెఫ్రిజిరేటర్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఫ్రిడ్జ్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారింది. దాదాపు 90 శాతం గృహాలలో ఇవి నిత్యావసరంగా మారాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే అవి ప్రమాదకరంగా మారవచ్చు. పేలిపోయే అవకాశం కూడా ఉంది. ఉష్ణోగ్రత నియంత్రణ, కంప్రెషర్ నిర్వహణ, విద్యుత్ హెచ్చుతగ్గులు వంటి విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అసలే ఎండాకాలం.. ఫ్రిడ్జ్‌ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త! భద్రత కోసం తప్పనిసరి చిట్కాలు
Refrigerator Maintenance
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2026 | 6:56 PM

Share

ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఒక అతి ముఖ్యమైన సామాన్య పరికరం. పండ్లు, కూరగాయలు, కూల్‌డ్రింక్స్‌, మాంసం, డెయిరీ ఉత్పత్తులు వంటివన్నీ.. ఫ్రిజ్‌లో సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యవంతమైన పరికరాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. రెఫ్రిజిరేటర్లు పేలిపోయి, ప్రాణాపాయం సంభవించిన సందర్భాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి సరైన నిర్వహణ, జాగ్రత్తలు తప్పనిసరి. ఫ్రిడ్జ్ భద్రతను నిర్ధారించడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. ముఖ్యమైన జాగ్రత్త రెఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత సెట్టింగ్‌కు సంబంధించింది. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు తగ్గించకూడదు. చాలా మంది ఐస్ త్వరగా గడ్డకట్టాలని లేదా వస్తువులు మరింత చల్లగా ఉండాలని భావించి ఉష్ణోగ్రతను అతి తక్కువ స్థాయికి సెట్ చేస్తారు. ఇది ఫ్రిడ్జ్ కంప్రెషర్‌పై అవసరానికి మించిన భారాన్ని పెంచుతుంది. కంప్రెషర్ అధిక పనితీరుతో నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. దీని ఫలితంగా అది వేడెక్కి, ఓవర్‌హీట్ అయి పేలిపోయే ప్రమాదం ఉంది. సరైన ఉష్ణోగ్రత సెట్టింగ్ పరికరం సామర్థ్యాన్ని కాపాడి, దాని జీవితకాలాన్ని పెంచుతుంది.

2. రెఫ్రిజిరేటర్ డోర్‌కు సంబంధించింది. ఫ్రిడ్జ్‌ను ఆన్ చేసి చాలా రోజులు దాని డోర్‌ను తెరవకుండా ఉంచినట్లయితే, దానిని తిరిగి తెరవడానికి ముందు చాలా జాగ్రత్త వహించాలి. ఈ పరిస్థితులలో డోర్ తెరిచే ముందు తప్పనిసరిగా విద్యుత్ సరఫరాను (పవర్) ఆపివేయాలి. ఆ తర్వాతే డోర్‌ను తెరవాలి. ఈ సాధారణ పద్ధతిని పాటించడం ద్వారా, డోర్ తెరచినప్పుడు లోపల ఏర్పడే ఒత్తిడి లేదా ఇతర సాంకేతిక సమస్యల వల్ల సంభవించే పేలుడు ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

3. కంప్రెషర్ మరమ్మతులకు సంబంధించినది. రెఫ్రిజిరేటర్ కంప్రెషర్‌లో ఏదైనా లోపం తలెత్తినప్పుడు, దానిని సరిచేయడానికి కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌కు మాత్రమే తీసుకెళ్లాలి. స్థానికంగా లభించే నాసిరకం లేదా నకిలీ విడిభాగాలను ఉపయోగించడం వల్ల కంప్రెషర్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. ఒరిజినల్ పార్ట్స్ మాత్రమే పరికరం పనితీరు, భద్రతకు హామీ ఇస్తాయి. నాసిరకం విడిభాగాలు దీర్ఘకాలంలో కంప్రెషర్ సామర్థ్యాన్ని తగ్గించి, పేలుడు వంటి తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు.

4. జాగ్రత్త కూడా ఉష్ణోగ్రత నియంత్రణకు సంబంధించినదే. ఐస్ గడ్డకట్టాలని ఉష్ణోగ్రతను తగ్గించి, ఎక్కువసేపు ఫ్రిడ్జ్ డోర్‌ను మూసి ఉంచడం మంచిది కాదు. కనీసం గంటకు ఒకసారైనా డోర్‌ను తెరిచి మూయడం వల్ల లోపలి ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇది కంప్రెషర్‌పై నిరంతర ఒత్తిడిని తగ్గిస్తుంది.

5. విద్యుత్ హెచ్చుతగ్గులు (వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్) ఉన్న ప్రాంతాలలో రెఫ్రిజిరేటర్‌ను ఉపయోగించకూడదు. అటువంటి పరిస్థితులలో స్టెబిలైజర్ లేకుండా ఫ్రిడ్జ్‌ను వాడితే, విద్యుత్ సరఫరాలో అస్థిరత కంప్రెషర్‌పై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కంప్రెషర్‌కు నష్టం కలిగించి, పేలుడు ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే, విద్యుత్ సరఫరా స్థిరంగా లేని చోట స్టెబిలైజర్‌ను ఉపయోగించడం లేదా రెఫ్రిజిరేటర్‌ను పూర్తిగా నివారించడం శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ రెఫ్రిజిరేటర్‌ను సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us