Video Viral: బాత్రూం వరకు వెంబడించాడు.. ట్రైన్ జర్నీలో విదేశీ మహిళకు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
భారత రైలు ప్రయాణంలో పోర్చుగీస్ మహిళా పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కొందరు యువకులు అనుసరించడం, వేధించడంతో అసౌకర్యానికి గురైంది. తన స్నేహితురాలి సహాయంతో టీటీఈకి ఫిర్యాదు చేయగా, రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి వారిని 2AC కోచ్‌కు మార్చారు. ఈ సంఘటన వైరల్‌గా మారి, భారతీయ రైళ్లలో మహిళల భద్రతపై చర్చకు దారితీసింది. రైల్ మదద్ యాప్‌ను ఉపయోగించమని సూచనలు వెలువడ్డాయి.

భారతదేశాన్ని సందర్శిస్తున్న ఒక పోర్చుగీస్ మహిళా పర్యాటకురాలు తన రైలు ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది వేగంగా వైరల్ అవుతోంది. తాను ఒక స్నేహితుడితో కలిసి జోధ్‌పూర్‌కు ప్రయాణిస్తున్నానని, వారు 3AC కోచ్‌లో ప్రయాణిస్తున్నారని ఆ మహిళ వివరించింది. ప్రారంభంలో ప్రతిదీ సాధారణంగా అనిపించింది. కానీ, కొంతసమయం తర్వాత, సమీపంలో కూర్చున్న కొంతమంది యువకుల ప్రవర్తనతో అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించిందని వాపోయింది.
ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం, తన ముందు కూర్చున్న కొంతమంది అబ్బాయిలు అదేపనిగా తననే చూస్తూ ఉన్నారని చెప్పింది.. అంతేకాకుండా, ఆమెను గమనిస్తూ ఉండటానికి వారు తమ సీట్లను మారుస్తూనే ఉన్నారు. దీని వల్ల ఆ ఇద్దరు పర్యాటకులు చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. మొదట వారు దానిని విస్మరించడానికి ప్రయత్నించారని, కానీ క్రమంగా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆ మహిళ చెప్పింది. కొంత సమయం తర్వాత ఆ మహిళ టాయిలెట్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఆమె ఉద్దేశపూర్వకంగా తన పక్కనే ఉన్న రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించకుండా ఉండి, సదరు యువకులను దాటకుండా ఉండటానికి మరొక కోచ్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే, తాను రెస్ట్‌రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే, దాదాపు 30 సెకన్ల తర్వాత ఒక యువకుడు తనను అక్కడ అనుసరించాడని ఆ మహిళ పేర్కొంది.
ఆ మహిళ చెప్పిన ప్రకారం, ఆ యువకుడు రెస్ట్‌రూమ్ తలుపు దగ్గరకు వచ్చి డోర్ తెరవడానికి ప్రయత్నించాడని చెప్పింది.. ఈ సమయంలో, ఆమె స్నేహితురాలు తనను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానించింది. ఆమె వెంటనే అక్కడికి చేరుకుని రెస్ట్‌రూమ్ బయట నిలబడి అతన్ని గమనిస్తూ..పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకుంది. తరువాత, ఇద్దరు మహిళలు ఈ సంఘటన గురించి రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE)కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని ఇద్దరు పర్యాటకులను మరొక కోచ్, 2ACకి తరలించారు. ఆ మహిళ తరువాత రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. వారి సహాయంతో తాను సురక్షితంగా ఉన్నానని చెప్పింది.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా మంది మహిళలు ప్రతిరోజూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని కొందరు ఎత్తి చూపారు. భారతదేశంలో రైలులో ప్రయాణించేటప్పుడు రైల్ మదద్ యాప్‌ను ఉంచుకోవాలని కొంతమంది వినియోగదారులు సలహా ఇచ్చారు. ఎందుకంటే ఇది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తుందని సూచించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




