వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని  వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు  ఇవే!

10-08-2026

Pic credit - Instagram

Phani Ch

ప్రతి వంటింట్లో ఉండే వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చాలామంది వెల్లుల్లి పొట్టును వ్యర్థంగా భావించి చెత్తబుట్టలో వేస్తుంటారు.

ఆ తొక్కల్లోనే అసలు ఔషధం దాగి ఉందంటున్నారు నిపుణులు! వెల్లుల్లి తొక్కల్లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

వీటిని కూరగాయల సూప్‌లలో వేసి మరిగించడం వల్ల ఆహారంలో పోషక విలువలు రెట్టింపు అవుతాయి. చర్మ సంబంధిత సమస్యలకు వెల్లుల్లి పొట్టు ఎంతో మేలు చేస్తుంది.

చర్మంపై దురద లేదా అలర్జీలు ఉన్నప్పుడు వెల్లుల్లిని తొక్కలతో సహా దంచి, ఆ రసాన్ని రాస్తే క్షణాల్లో ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు మన శిరోజాల సంరక్షణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టులో చుండ్రు లేదా పేల సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి తొక్కలను మరిగించిన నీటిని మాడకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆస్తమా మరియు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి పొట్టు ఒక మంచి హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. పొట్టును మెత్తగా గ్రైండ్ చేసి రోజూ ఉదయం, సాయంత్రం తేనెతో కలిపి తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

కాళ్ల నొప్పులు, పాదాల వాపులతో సతమతమయ్యే వారు ఈ చిన్న చిట్కా పాటిస్తే మంచిది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో వెల్లుల్లి తొక్కలు వేసి మరిగించి, ఆ నీటిలో పాదాలను ఉంచితే వాపులు త్వరగా తగ్గుతాయి.

మొక్కలు పెంచే అలవాటు ఉన్నవారు వెల్లుల్లి తొక్కలను పారేయకుండా సహజసిద్ధమైన ఎరువుగా వాడవచ్చు. వీటిలో ఉండే ఘాటైన వాసన మరియు పోషకాలు మొక్కలకు పట్టే క్రిమికీటకాలను నివారిస్తాయి.