AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR Captain : కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే.. అనుభవం వైపే మొగ్గు చూపిన షారుఖ్ ఖాన్ టీమ్

IPL 2026 KKR Captain : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథిగా అజింక్య రహానేను కొనసాగించనున్నారు. గాయం వల్ల హర్షిత్ రాణా ఈ సీజన్‌కు దూరం కాగా, ముస్తాఫిజుర్ స్థానంలో ముజరబానీ జట్టులోకి వచ్చాడు. జట్టు కూర్పు విషయంలో ఈసారి కేకేఆర్ చాలా పకడ్బందీగా వ్యవహరించింది.

KKR Captain : కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే.. అనుభవం వైపే మొగ్గు చూపిన షారుఖ్ ఖాన్ టీమ్
కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ ప్లేయింగ్ XI: అజింక్య రహానే, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, మతీషా పతిరాన, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి.
Rakesh
|

Updated on: Mar 15, 2026 | 6:10 PM

Share

KKR Captain : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) క్యాంప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. 37 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్, ఈ ఏడాది కూడా జట్టును ముందుండి నడిపించబోతున్నాడని సమాచారం. అనుభవం దృష్ట్యా రహానేనే సరైన ఎంపిక అని ఫ్రాంచైజీ భావిస్తోంది. గత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన రహానే, ఈసారి కూడా వన్ డౌన్ (నెం.3) పొజిషన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

జట్టు కూర్పు విషయంలో ఈసారి కేకేఆర్ చాలా పకడ్బందీగా వ్యవహరించింది. ముఖ్యంగా వేలంలో న్యూజిలాండ్ స్టార్లైన ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్రలతో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. వీరంతా టాప్ ఆర్డర్ బ్యాటర్లే కావడంతో ఓపెనింగ్‌లో ఎవరిని దింపాలనేది ఇప్పుడు రహానేకు పెద్ద తలనెప్పిగా మారింది. ఒకవైపు సునీల్ నరైన్ లాంటి విధ్వంసకర ఓపెనర్ ఉండగా, మరోవైపు ఈ నలుగురు విదేశీ స్టార్లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది ఆసక్తికరంగా మారింది. మతీషా పతిరన, రోవ్‌మన్ పావెల్ వంటి పవర్‌ఫుల్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు.

అయితే, సీజన్ ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరిలో నవీ ముంబైలో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఆడుతుండగా అతడు గాయపడ్డాడు. రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న కీలక బౌలర్ అందుబాటులో లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. హర్షిత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం మేనేజ్‌మెంట్ అన్వేషిస్తోంది.

మరోవైపు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో జింబాబ్వే స్పీడ్‌స్టర్ బ్లెస్సింగ్ ముజరబానీని కేకేఆర్ ఒప్పందం చేసుకుంది. ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, బీసీసీఐ సూచన మేరకు అతడిని జట్టు నుంచి తప్పించి ముజరబానీని రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. దీంతో బౌలింగ్ విభాగంలో కొత్త రక్తం చేరినట్లయింది. మొత్తానికి రహానే సారథ్యంలో, కొత్త విదేశీ ఆటగాళ్ల అండతో కేకేఆర్ ఈసారి తన నాలుగో ఐపీఎల్ టైటిల్ వేటను ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us