Video: నా విక్టరీ సీక్రెట్ ఇదే.. 8 ఏళ్లుగా ఒకే అండర్‌వేర్‌తో గ్రౌండ్‌లోకి.. షాకిచ్చిన స్టార్ ప్లేయర్..!
Ederson Bizarre Superstition: మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ ఎంత ముఖ్యమో, మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ఇలాంటి నమ్మకాలు కూడా వారికి అంతే ముఖ్యం. ఏదేమైనా, ఎనిమిదేళ్లుగా ఒకే అండర్‌వేర్ ధరించి ఇన్ని విజయాలు అందుకోవడం కచ్చితంగా ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక అరుదైన, విచిత్రమైన రికార్డుగా నిలిచిపోతుంది.

Brazil Football Player Unique Superstition: క్రీడాకారులకు సెంటిమెంట్లు, నమ్మకాలు ఉండటం కొత్తేమీ కాదు. కొందరు మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు కుడికాలు ముందు పెడితే, మరికొందరు ప్రత్యేకమైన జెర్సీలను ధరిస్తారు. కానీ, బ్రెజిల్ దేశానికి చెందిన ఒక స్టార్ ఫుట్‌బాలర్ మాత్రం ఎవరూ ఊహించని, వినడానికే కాస్త వింతగా అనిపించే అత్యంత విచిత్రమైన సెంటిమెంట్‌ను పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను గత ఎనిమిదేళ్లుగా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఒకే అండర్‌వేర్ ధరిస్తున్నానని సంచలన ప్రకటన చేశాడు.
ఆ స్టార్ గోల్‌కీపర్ ఎవరు..?
ఈ వింత సెంటిమెంట్‌ను బయటపెట్టి క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసిన ఆటగాడు మరెవరో కాదు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మాంచెస్టర్ సిటీ క్లబ్ ప్రధాన గోల్‌కీపర్, బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ ఎడర్సన్. మైదానంలో ప్రత్యర్థుల షాట్లను అడ్డుకోవడంలో ఎంతటి నైపుణ్యం చూపిస్తాడో, వ్యక్తిగత జీవితంలో ఈయన నమ్మకం అంతకంటే విచిత్రంగా ఉంటుంది. గత ఏడాది ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎడర్సన్ స్వయంగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.
ఎనిమిదేళ్ల ప్రయాణం.. ఒకే అండర్ వేర్‌తో..!
ఎడర్సన్ 2017 సంవత్సరంలో ప్రతిష్టాత్మక మాంచెస్టర్ సిటీ క్లబ్‌లో చేరాడు. నాటి నుంచి నేటి వరకు జట్టు సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. అయితే, బీబీసీ నిర్వహించిన ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన విజయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వివరిస్తూ ఈ రహస్యాన్ని విప్పాడు. “నాకు ఒకే ఒక్క సెంటిమెంట్ ఉంది. నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లోనూ ఒకే ఒక అండర్‌వేర్ వాడుతున్నాను” అని నవ్వుతూ చెప్పాడు.
ఈ సమాధానం విన్న వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆశ్చర్యపోతూ.. “మరి ఎనిమిదేళ్లుగా వాడుతుంటే దాని రూపురేఖలు మారిపోయి, చిరిగిపోయి ఉంటుంది కదా?” అని అడిగాడు. దానికి ఎడర్సన్ స్పందిస్తూ, “అలా ఏమీ లేదు, అది ఇంకా చాలా బాగుంది” అంటూ నవ్వేశాడు.
ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!
విజయాల వెనుక ఆ సెంటిమెంటే కారణమా..?
Ederson has been wearing the same boxers on matchdays for EIGHT YEARS. 🤯 😅#MCFC #BBCFootball pic.twitter.com/dDIU6jfc58
— Match of the Day (@BBCMOTD) April 2, 2025
ఎడర్సన్ ఈ వింత అలవాటును కేవలం సరదా కోసం చేయడం లేదు, అది తనకు బాగా కలిసి వచ్చిందని నమ్ముతాడు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన మాంచెస్టర్ సిటీ క్లబ్ తరపున ఎన్నో ప్రతిష్టాత్మక ట్రోఫీలను ముద్దాడాడు. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ గోల్‌కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బహుశా ఈ అపారమైన విజయాల వల్లే ఆయన ఆ సెంటిమెంట్‌ను ఇప్పటికీ ప్రాణంగా నమ్ముతున్నాడని అభిమానులు భావిస్తున్నారు.
అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్..
ఎడర్సన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ కూడా ఎంతో ఘనంగా సాగింది. 2018లో చిలీ దేశంతో జరిగిన మ్యాచ్ ద్వారా ఆయన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లోనూ బ్రెజిల్ జట్టులో ఆయన చోటు దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన బ్రెజిల్ జట్టు తరపున ఆయన ఒక మ్యాచ్‌లో మైదానంలోకి దిగాడు. ఇప్పటివరకు బ్రెజిల్ జాతీయ జట్టు కోసం 31 మ్యాచ్‌లు ఆడిన ఎడర్సన్, మాంచెస్టర్ సిటీ క్లబ్ తరపున ఏకంగా 276 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




