AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఐర్లాండ్ గడ్డను టచ్ చేసిన 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్ ఇచ్చేసిన బుడ్డోడు..!

Indian Cricket Team Dublin Arrival: యువ ఆటగాళ్ల సత్తాకు ఈ ఐర్లాండ్ పర్యటన ఒక అగ్నిపరీక్ష లాంటిది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత్ ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Video: ఐర్లాండ్ గడ్డను టచ్ చేసిన 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్ ఇచ్చేసిన బుడ్డోడు..!
Vaibhav Suryavanshi Selfie With Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Jun 24, 2026 | 5:42 PM

Share

Vaibhav Suryavanshi Debut: ఐర్లాండ్ యువ జట్టుతో హోరాహోరీ పోరుకు భారత పురుషుల క్రికెట్ జట్టు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల నయా సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే నెలకొంది.

ఐర్లాండ్ చేరుకున్న భారత యువ సింహాలు..

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఐర్లాండ్‌లో ల్యాండ్ అయింది. చెన్నై నుంచి ఉదయం విమానం ఎక్కిన మన ఆటగాళ్లు రాత్రి కల్లా డబ్లిన్ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు అక్కడి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఈ పర్యటనలో భారత్ రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో యువ రక్తాన్ని పరీక్షించేందుకు సెలెక్టర్లు ఈ సిరీస్‌ను వేదికగా చేసుకున్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ‘ఓపెనర్స్ సెల్ఫీ’..

ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విమాన ప్రయాణంలో తన సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి తీసుకున్న సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు సీనియర్ ఆటగాళ్లతో ఎంతో సరదాగా గడుపుతున్న ఫోటోలు చూసి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

చరిత్ర సృష్టించనున్న 15 ఏళ్ల వండర్ కిడ్..

వైభవ్ సూర్యవంశీకి ఇది మొట్టమొదటి అంతర్జాతీయ సిరీస్ కావడం విశేషం. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గనుక ఈ యువకుడు బరిలోకి దిగితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు తరఫున ముక్కోణపు సిరీస్ గెలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అదే ఫామ్‌ను ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు.

ఇంగ్లాండ్ సిరీస్ సాధించాలంటే ఇక్కడ గెలవాల్సిందే!

ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు నేరుగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై 1 నుంచి 11 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా వైభవ్ ఎంపికైనప్పటికీ, అక్కడ తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ అతను తన విశ్వరూపం చూపించాల్సి ఉంటుంది. కేవలం భారత అభిమానులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు సైతం ఈ చిచ్చరపిడుగు బ్యాటింగ్ శైలిని చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

షెడ్యూల్ వివరాలు ఇవే:

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే రెండు టీ20 మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:

తొలి టీ20 మ్యాచ్: జూన్ 26

రెండో టీ20 మ్యాచ్: జూన్ 28

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..