AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Dev: ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. అది హిట్ అయ్యిందే నా కెరీర్ మరోలా ఉండేది: సత్యదేవ్

ట్యాలెంట్ ఉన్నా అదృష్టం లేని హీరోల్లో సత్యదేవ్ ముందుంటాడు. అతని సినిమాల సెలెక్షన్, యాక్టింగ్ అన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. కానీ ఇప్పటివరకు స్టార్ హీరోగా ఎదగలేకపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మరి ఈ లోటును 'రావు బహదూర్ సినిమా తీరుస్తుందేమో చూడాలి.

Satya Dev: ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. అది హిట్ అయ్యిందే నా కెరీర్ మరోలా ఉండేది: సత్యదేవ్
Satya Dev
Basha Shek
|

Updated on: Jun 24, 2026 | 10:06 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో చాలా హీరోల్లో సైడ్ యాక్టర్ గా చేసిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తదితర సినిమాలతో వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గానూ ఆకట్టుకున్నాడు అయితే ఈ ట్యాలెంటెడ్ హీరోకు ఇప్పటివరకు సరైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. దీంతో ఇప్పుడు సత్యదేవ్ ఆశలన్నీ రావు బహదూర్ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కూడా మూవీపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరో సత్యదేవ్ కూడా చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమా కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సత్యదేవ్.

కాగా సత్యదేవ్ సినిమా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా బ్లఫ్ మాస్టర్. చాలా మందికి ఇది ఫేవరెట్ సినిమా. టీవీల్లో వస్తే అసలు వదిలిపెట్టరు. కానీ ఈ మూవీ థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడలేదు. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. సత్యదేవ్. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ, సినిమా విడుదలకు ముందు కూడా ‘బ్లఫ్ మాస్టర్’ అద్భుతమైన విజయం సాధిస్తుందని మేమంతా భావించాం. అయితే రిలీజ్ తర్వాత ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అది నాకు చాలా నిరాశ కలిగించింది. ఆ సినిమా విడుదలై దాదాపు ఆరు సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో ‘బ్లఫ్ మాస్టర్’కు రావాల్సిన గుర్తింపు వచ్చి ఉంటే నా కెరీర్ మరింత మెరుగ్గా ఉండేదేమో అనిపించేది. కానీ ఆ తర్వాత జీవితంలో ఇలాంటి విషయాలు సహజమే అని నేర్చుకున్నాను’ అని సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

‘రావు బహదూర్’ సినిమా విషయానికి వస్తే ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అగ్ర నటుడు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us