AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RR: కాటేరమ్మ కొడుకులు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్.. అతనొక్కడు చాలు.. ఉతికారేస్తాం..: రియాన్ పరాగ్

SRH vs RR, Riyan Parag comments: లీగ్ దశ ఫలితాలు ఎలా ఉన్నా, నాకౌట్ ఒత్తిడిని తట్టుకుని నిలబడే జట్టే విజేతగా నిలుస్తుంది. రియాన్ పరాగ్ ఆత్మవిశ్వాసం, జోఫ్రా ఆర్చర్ ఫామ్ రాజస్థాన్‌ను గట్టెక్కిస్తాయా.. లేక ఆరెంజ్ ఆర్మీ తమ విజయ పరంపరను కొనసాగిస్తుందా అనేది ముల్లాన్‌పూర్ మైదానంలో తేలనుంది. ఈ హై-వోల్టేజ్ క్రికెట్ యుద్ధం కోసం క్రీడాభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు!

SRH vs RR: కాటేరమ్మ కొడుకులు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్.. అతనొక్కడు చాలు.. ఉతికారేస్తాం..: రియాన్ పరాగ్
Riyan Parag Comments On Rr Vs Srh Match
Venkata Chari
|

Updated on: May 26, 2026 | 2:46 PM

Share

IPL 2026 Eliminator, SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయంతో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు ప్లేఆఫ్స్ నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ముల్లాన్‌పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్న వేళ, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముంబైపై గెలుపు.. ప్లేఆఫ్స్‌లోకి రాజస్థాన్ రాయల్స్ ఎంట్రీ..!

లీగ్ దశలో ఊగిసలాడిన రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరగానే విఫలమైనప్పటికీ, మిగిలిన బ్యాటర్లు బాధ్యతాయుతంగా రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 200 పరుగుల భారీ మార్కును దాటింది. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసి, టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని సజీవంగా ఉంచుకుంది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయి, మధ్యలో వరుస ఓటములతో కిందమీద పడ్డ రాజస్థాన్, చివరికి అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది.

సన్‌రైజర్స్‌తో పరువు పోరాటం.. ముచ్చటగా మూడోసారా? లేక ప్రతీకారమా?

ప్లేఆఫ్స్ చేరిన ఆనందం రాజస్థాన్ శిబిరంలో కనిపిస్తున్నప్పటికీ, ఎలిమినేటర్ పోరు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌లో బలీయమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును ఢీకొట్టవలసి ఉంది. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ చావోరేవో పోరులో రాజస్థాన్ పరువు కాపాడుకుని రెండో క్వాలిఫైయర్‌కు చేరుకుంటుందా, లేక సన్‌రైజర్స్ చేతిలో ముచ్చటగా మూడోసారి ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

నా అసలు పరిస్థితి అది.. రియాన్ పరాగ్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ముంబైపై విజయం అనంతరం రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. “నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆడేటప్పుడు నేను శారీరకంగా అస్సలు ఫిట్‌గా లేను. మానసికంగా కూడా ఎంతో కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. అసలు ఈరోజు నేను మైదానంలోకి దిగకూడదు. కానీ జట్టు పరిస్థితి దృష్ట్యా ఆడాల్సి వచ్చింది” అని పరాగ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు.

సన్‌రైజర్స్‌ను ముంచేందుకు మా దగ్గర ఆయుధం ఉంది..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రియాన్ పరాగ్ ప్రశంసలు కురిపిస్తూనే, వారిని ఎలా దెబ్బకొట్టాలో తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు. “హైదరాబాద్ జట్టు చాలా బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. లీగ్ దశలో ఇప్పటికే రెండు సార్లు వారి చేతిలో ఓడిపోయాం. అయితే నాకౌట్ మ్యాచ్ పూర్తిగా భిన్నమైనది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఎదుర్కొనేందుకు మాకున్న అసలైన ఆయుధం జోఫ్రా ఆర్చర్. ముంబై మ్యాచ్‌లో కూడా అతడు ఓటమికి అడ్డుగోడలా నిలిచి, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి విజయానికి బాటలు వేశాడు. హైదరాబాద్‌పై కూడా మేము మరోసారి సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగుండదు” అని పరాగ్ స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే