AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపించనున్నాయి.

Weather: ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
Ap Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2026 | 3:21 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో 48 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఓ వైపు ఉక్కపోత.. మరో వైపు వేడితో.. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ఆగమనంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 26 మే 2026 నాటికి 7° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 7° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, 7° ఉత్తర అక్షాంశం /75° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /80° తూర్పు రేఖాంశం, 10° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 13.5° ఉత్తర అక్షాంశం /90° తూర్పు రేఖాంశం, 17°ఉత్తర అక్షాంశం/95° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం – అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు నిన్నటి ఉత్తర -దక్షిణ ద్రోణి దక్షిణ బీహార్ నుండి జార్ఖండ్ మరియు అంతర్గత ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది.

వీటితోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు, నైరుతి బంగాళాఖాతం, మన్నార్ గల్ఫ్, దక్షిణ తమిళనాడు తీరం, కొమరిన్ ప్రాంతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన నిన్నటి ద్రోణి ఈరోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల అవకాశముంది. బలమైన గాలులు గరిస్టముగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Follow Us