AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : టీవీలు కట్టేయండి.. ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్

IPL 2026 : వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఎంతో నమ్మకమైన ఆటగాడిని ఎటువంటి కారణం లేకుండా తొలగించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

IPL 2026 : టీవీలు కట్టేయండి.. ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్
Ipl 2026
Rakesh
|

Updated on: Jan 05, 2026 | 2:13 PM

Share

IPL 2026 : క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. ఐపీఎల్ టెలికాస్ట్‌పై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు క్రీడారంగంలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక ఆటగాడి విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు దేశాల మధ్య పంతాలకు దారితీయడం గమనార్హం.

వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఎంతో నమ్మకమైన ఆటగాడిని ఎటువంటి కారణం లేకుండా తొలగించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది కేవలం ఒక క్రీడాకారుడికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, తమ దేశ గౌరవానికి సంబంధించిన విషయమని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వివాదం కేవలం ఐపీఎల్ తోనే ఆగడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ఘాటైన లేఖ రాసింది. 2026 ఫిబ్రవరిలో భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు పాల్గొనే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటగాళ్లకు సేఫ్టీ లేదని, అక్కడి వాతావరణం నిష్పక్షపాతంగా లేదని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఐసీసీ అంగీకరించకపోతే, తాము వరల్డ్ కప్ కోసం భారత్‌కు జట్టును పంపే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ తెగేసి చెప్పింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 పై ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అక్కడ టెలికాస్ట్ ఆగిపోతే ప్రకటనల ఆదాయానికి గండి పడవచ్చు. మరోవైపు, దక్షిణాసియాలో క్రికెట్ బలమైన శక్తులుగా ఉన్న భారత్-బంగ్లా మధ్య ఇలాంటి విభేదాలు రావడం క్రీడాభిమానులను కలవరపెడుతోంది. ఇది కేవలం క్రీడలకే పరిమితమవుతుందా లేక రాజకీయంగానూ చిచ్చు పెడుతుందా అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..