Hardik Pandya: హార్దిక్, నటాషాల మధ్య విభేదాలు! ఇన్‌స్టా బయోలో ‘పాండ్యా’ పేరును తొలగించిన భార్య.. కారణమదేనా?

ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్‌లో అతను మంచి ప్రదర్శన చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఐదుసార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ రౌండ్ లోనే ముగించాల్సి వచ్చింది.

Hardik Pandya: హార్దిక్, నటాషాల మధ్య విభేదాలు! ఇన్‌స్టా బయోలో 'పాండ్యా' పేరును తొలగించిన భార్య.. కారణమదేనా?
Hardik Pandya Family
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2024 | 6:51 PM

IPL 2024 టోర్నమెంట్ ముంబై ఇండియన్స్‌కు ఒక పీడకల అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక హార్దిక్ పాండ్యా క్రికెట్ కెరీర్‌లో ఇది చెత్త కాలమని కూడా చెప్పవచ్చు. ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్‌లో అతను మంచి ప్రదర్శన చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఐదుసార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ రౌండ్ లోనే ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్యాకు వైస్‌ కెప్టెన్సీ దక్కింది. అతని నుంచి మంచి ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నాను. ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలోను సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భార్య నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ కు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ విడిపోయారని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌లో ఎక్కువగా మాట్లాడుకునే జంట హార్దిక్-నటాషా. ఈ జంట ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో అప్‌డేట్ చేసుకోవడం అభిమానులు చూశారు. ఇద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వీరి రిలేషన్ షిప్ పై ఒక్కసారిగా రూమర్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2024 సీజన్ మొత్తంలో నటాషా మైదానంలో కనిపించలేదు. హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఉన్నప్పటికీ, నటాషా మైదానంలో కనిపించలేదు. హార్దిక్ పాండ్యా బ్యాడ్ టైమ్‌లో ఉన్నప్పుడు, అతనికి సపోర్టు ఇవ్వడానికి నటాషా ఎందుకు మైదానంలోకి రావడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక మార్చి 4 నటాషా పుట్టినరోజు. అప్పుడు హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలోనూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో ఈ బ్రేకప్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది.

View this post on Instagram

A post shared by @natasastankovic__

మరోవైపు, నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ బయో నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. అలాగే గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫోటోలను అసలు షేర్ చేసుకోవడం లేదు. . దీంతో బ్రేకప్ రూమర్లు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కుమారుడితో నటాషా..

View this post on Instagram

A post shared by @natasastankovic__

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..