- Telugu News Photo Gallery Cinema photos Kantara actor Rishab Shetty family celebrates their daughter's literacy function a Chikkamagaluru Temple, Shares photos
Rishab Shetty: కూతురి అక్షరాభ్యాస వేడుక.. ఫొటోలు షేర్ చేసిన కాంతారా హీరో.. ఎంత చూడముచ్చటగా ఉన్నారో!
కాంతారా మూవీతో పాన్ ఇండియా హీరో కమ్ డైరెక్టర్ గా మారిపోయాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. అతనే స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడ నాటతో పాటు దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. రిషబ్ కు ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది.
Updated on: May 23, 2024 | 8:44 PM

కాంతారా మూవీతో పాన్ ఇండియా హీరో కమ్ డైరెక్టర్ గా మారిపోయాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. అతనే స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడ నాటతో పాటు దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. రిషబ్ కు ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు రిషబ్ శెట్టి. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

రిషబ్ శెట్టికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే అతను తరచూ తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.

తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి శారదా మఠంలో ఈ వేడుక నిర్వహించారు.

తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఫ్యామిలీ చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.