- Telugu News Photo Gallery Cinema photos War 2 starrer Hrithik Roshan and Jr.NTR funny chat details Telugu Heroes Photos
Jr.NTR: హృతిక్, తారక్ మధ్య సరదా చాట్.. నెట్టింట వైరల్.
తారక్ మన దగ్గర ప్రాజెక్టులకు ఎన్నాళ్లు కమిట్ అయ్యారో ఏమో గానీ, నార్త్ లో వార్ విషయంలో ఆయన కమిట్‌మెంట్ ఏంటన్నదాని మీద ఓ క్లారిటీ కనిపిస్తోంది. జస్ట్ ఆ ప్రాజెక్ట్ విషయంలోనే కాదు, గ్రీక్ గాడ్ హృతిక్‌తో మన తారక్ బాండింగ్ ఎలా ఉందనే విషయం మీద కూడా ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దేవర పాట పాడుకుంటూ ఊపు మీదున్నారు తారక్ ఫ్యాన్స్. అయితే అంతకన్నా ఊపు తెచ్చిన విషయం సోషల్ మీడియా వేదికగా జరిగిన హృతిక్ అండ్ తారక్ కాన్వర్జేషన్.
Updated on: May 23, 2024 | 8:16 PM

దేవర 2తో పాటు నీల్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తారు జూనియర్. జనవరి 9, 2026న తారక్, నీల్ సినిమా రిలీజ్ కానుంది. ఇది జరగాలంటే 2025లోనే షూట్ మొదలు కావాలి. మొత్తానికి చూడాలిక.. ఈ ఇద్దరి ప్లానింగ్ ఎలా ఉండబోతుందో.?

జస్ట్ ఆ ప్రాజెక్ట్ విషయంలోనే కాదు, గ్రీక్ గాడ్ హృతిక్‌తో మన తారక్ బాండింగ్ ఎలా ఉందనే విషయం మీద కూడా ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దేవర పాట పాడుకుంటూ ఊపు మీదున్నారు తారక్ ఫ్యాన్స్.

అయితే అంతకన్నా ఊపు తెచ్చిన విషయం సోషల్ మీడియా వేదికగా జరిగిన హృతిక్ అండ్ తారక్ కాన్వర్జేషన్. సూర్యుడి చుట్టూ తిరిగే భూమిని ప్రస్తావిస్తూ ఏడాది కాలం గడిచిందని గుర్తుచేశారు హృతిక్.

మరో ఏడాది పాటు తారక్‌తో కలిసి ట్రావెల్ చేయబోయే విషయాన్ని కూడా ప్రస్తావించారు. వార్ ఫస్ట్ పార్టులో ఉన్నట్టుగానే ఇందులోనూ గురు, శిష్యుల సంబంధం కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

స్టూడెంట్ నేర్చుకోవడానికి రెడీ అయినప్పుడు, టీచర్ నేర్పించడానికి ప్రత్యక్షమవుతారని, ఇప్పుడు హృతిక్ అందుకు రెడీగా ఉన్నారని సరదాగా కామెంట్ చేశారు తారక్.

స్క్రీన్ మీద గురుశిష్యులు ఇద్దరూ ఏ రేంజ్‌లో చెలరేగుతారో విట్‌నెస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు ప్యాన్ ఇండియా ఆడియన్స్.

వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధం కానుంది వార్2. అంటే, ఈ లెక్కన ఈ ప్రాజెక్టు కోసం మరో ఏడాది పాటు పని చేస్తారన్నమాట తారక్.




