- Telugu News Photo Gallery Cinema photos Heroine Mrunal Thakur Talks About Body Shaming Telugu Actress Photos
Mrunal Thakur: ఏమైనా అనుకోండి.. బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన మృణాల్.
అటెన్షన్ సీకర్ అని అనుకోండి.. తెగబడి మాట్లాడేస్తున్నానని అనుకోండి.. ఎవరేమనుకున్నా మనసులో ఉన్న మాటలను చెప్పడానికి నేనెప్పుడూ వెనకాడను అన్నట్టుంది మృణాల్ ఠాకూర్ ధోరణి చూస్తుంటే. మామూలుగా గ్లామర్ ఇండస్ట్రీలో చాలా మంది అడ్రస్ చేయడానికి భయపడే విషయాల గురించి అవలీలగా మాట్లాడుతున్నారు మృణాల్. ఆల్రెడీ ఆమె చెప్పిన విషయమే అయినా, మరోసారి సేమ్ టాపిక్‌తో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ.
Updated on: May 23, 2024 | 6:18 PM

అటెన్షన్ సీకర్ అని అనుకోండి.. తెగబడి మాట్లాడేస్తున్నానని అనుకోండి.. ఎవరేమనుకున్నా మనసులో ఉన్న మాటలను చెప్పడానికి నేనెప్పుడూ వెనకాడను అన్నట్టుంది మృణాల్ ఠాకూర్ ధోరణి చూస్తుంటే.

మామూలుగా గ్లామర్ ఇండస్ట్రీలో చాలా మంది అడ్రస్ చేయడానికి భయపడే విషయాల గురించి అవలీలగా మాట్లాడుతున్నారు మృణాల్.

ఆల్రెడీ ఆమె చెప్పిన విషయమే అయినా, మరోసారి సేమ్ టాపిక్‌తో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్.

ఇప్పుడంటే వరుస సక్సెస్‌లు ఉన్నాయి కాబట్టి, ఆమె మనసులోని మాటలన్నిటినీ చెబుతున్నారనుకుంటే పొరపాటే. ఆమె డే ఒన్ నుంచి అలాగే మాట్లాడుతున్నారన్నది అబ్జర్వర్స్ అందరికీ తెలిసిన విషయం.

లేటెస్ట్ గా బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు మృణాల్ ఠాకూర్. అసలు ఒకరి రూపురేఖల గురించి మాట్లాడే అర్హత మరొకరికి ఎలా ఉంటుందన్నది ఆమె వేస్తున్న ప్రశ్న.

రంగూ రూపులను బట్టి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని బట్టి అంచనాకు రావడం చాలా ఘోరం అని అన్నారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్‌కి గురయ్యానని పలు మార్లు గుర్తుచేసుకున్నారు.

మనిషి మనస్తత్వాన్ని బట్టి మంచీ చెడులను నిర్ణయించాలని, గ్లామర్ ఇండస్ట్రీకి అందం అవసరమే కానీ, అందం గురించి వ్యక్తిని కించపరచడం దారుణమని చెప్పారు సీతారామమ్ హీరోయిన్.





























