- Telugu News Photo Gallery Cinema photos Heroine Aditi Rao Hydari no comments on her marriage news Telugu Actress Photos
Aditi Rao Hydari: పెళ్లి పై నో కామెంట్స్.. కానీ ఆ డైరెక్టర్ పై అదితిరావు కామెంట్స్ వైరల్.
మొన్న మొన్నటిదాకా ప్రేమ, నిశ్చితార్థ వార్తల్లో ఉన్న అదితిరావు హైదరి ఇప్పుడు ఉన్నపళంగా వర్క్ బేస్డ్ న్యూస్‌తో నార్త్ లో హల్‌చల్ చేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేగానీ కొన్ని పాత్రలు చేయలేం అని అంటున్నారు అదితిరావు హైదరి. ఉన్నపళంగా ఆమె ట్రెండింగ్‌లోకి ఎందుకు వచ్చినట్టు..? సంజయ్ లీలా భన్సాలితో పరిచయమే తన అదృష్టమని అంటున్నారు నటి అదితిరావు హైదరి.
Updated on: May 23, 2024 | 5:40 PM

మొన్న మొన్నటిదాకా ప్రేమ, నిశ్చితార్థ వార్తల్లో ఉన్న అదితిరావు హైదరి ఇప్పుడు ఉన్నపళంగా వర్క్ బేస్డ్ న్యూస్‌తో నార్త్ లో హల్‌చల్ చేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేగానీ కొన్ని పాత్రలు చేయలేం అని అంటున్నారు అదితిరావు హైదరి.

ఉన్నపళంగా ఆమె ట్రెండింగ్‌లోకి ఎందుకు వచ్చినట్టు..? సంజయ్ లీలా భన్సాలితో పరిచయమే తన అదృష్టమని అంటున్నారు నటి అదితిరావు హైదరి.

అందులోనూ రీసెంట్‌గా హీరామండి చూసిన ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు అదితిరావు హైదరి.

తన కెరీర్‌లో బిబోజాన్ కేరక్టర్‌కి చాలా స్పెషాలిటీ ఉందని హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. అసలు సంజయ్‌లీలా భన్సాలీ సెట్ లో అడుగుపెట్టిన తొలి క్షణాలను తాను మర్చిపోలేనని అంటున్నారు మిస్ హైదరి.

పద్మావత్ సెట్లో అడుగుపెట్టినప్పుడు, అసలు తాను ఈ లోకంలోనే ఉన్నానా? అని ఆశ్చర్యపోయారట. ఒక్క క్షణం తనను తాను మర్చిపోయారట.

అదే సమయంలో పక్కనున్న రణ్‌వీర్ ఆమెను తట్టి 'అదూ... నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్లావా ఏంటి' అని ఆటపట్టించారట. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనని అంటున్నారు అదితి.

ఇటీవల సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం జరిగింది అదితిరావు హైదరికి. పెళ్లి ఎప్పుడని చాలా మంది పదే పదే అడుగుతున్నారట. అయితే దాని గురించి మాత్రం గప్‌చుప్‌గా ఉన్నారు ఈ బ్యూటీ.

అన్నీ విషయాలు అందరితో ఎందుకు చెప్పాలి? కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వాటిని అందరూ గౌరవించాలని మనసులో మాటను చెప్పేశారు ఈ లేడీ.





























