- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi waiting to do movie with harish shankar after vishwambhara
Chiranjeevi: ఆ దర్శకుడు ఒక్కడి కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్.. ఇంతకీ అతను ఎవరంటే ??
ఓవైపు చూస్తేనేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా విశ్వంభర షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ట. దాంతో కచ్చితంగా చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలిప్పుడు. లేకపోతే అనవసరంగా టైమ్ వేస్ట్ అయిపోతుంది. మరోవైపు రీమేక్‌లు ఇస్తున్న షాక్‌లతో వాటివైపు చూడట్లేదు మెగాస్టార్. మరి ఈ టైమ్‌లో చిరంజీవిని మెప్పించి.. స్ట్రెయిట్ ఆఫర్ అందుకునే ఆ దర్శకుడెరు..? రేసులో ఎంతమంది ఉన్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: May 23, 2024 | 12:58 PM

ఓవైపు చూస్తేనేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా విశ్వంభర షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ట. దాంతో కచ్చితంగా చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలిప్పుడు. లేకపోతే అనవసరంగా టైమ్ వేస్ట్ అయిపోతుంది. మరోవైపు రీమేక్‌లు ఇస్తున్న షాక్‌లతో వాటివైపు చూడట్లేదు మెగాస్టార్. మరి ఈ టైమ్‌లో చిరంజీవిని మెప్పించి.. స్ట్రెయిట్ ఆఫర్ అందుకునే ఆ దర్శకుడెరు..? రేసులో ఎంతమంది ఉన్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యారు చిరంజీవి. చూస్తుంటే మరో నెల రోజుల్లోనే వశిష్ట సినిమా నుంచి ఫ్రీ అయ్యేలా కనిపిస్తున్నారాయన. జూన్ మధ్యలోనే విశ్వంభర టాకీ పార్ట్ పూర్తి కానుంది. అప్పట్నుంచి ఆర్నెళ్ల పాటు పోస్ట్ ప్రొడక్షన్‌తోనే బిజీగా ఉంటారు మేకర్స్.

విశ్వంభర పూర్తిగా విజువల్ బేస్డ్ సినిమా కాబట్టి చిరంజీవి డేట్స్ కూడా తక్కువే అవసరం. అంతా విఎఫ్ఎక్స్ మాయాజాలమే ఉంటుంది. అందుకే ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తెచ్చేందుకు చాలా రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నారు చిరంజీవి. అప్పట్లో కళ్యాణ్ కృష్ణ సినిమా అనుకున్నా కుదర్లేదు.. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా పేరు కూడా వినిపించింది.

మోహన్ రాజా ప్రస్తుతం తని ఒరువన్ 2తో బిజీగా ఉన్నారు. ఆయన మరో ఏడాది వరకు టాలీవుడ్ వైపు చూడనట్లే. ఇక కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్టయ్యేలా కనిపించట్లేదు. త్రినాథరావు నక్కిన పేరు వినిపించినా.. సందీప్ కిషన్ సినిమాతో ఆయన బిజీ అయిపోయారు. మిగిలిన స్టార్ డైరెక్టర్స్ అంతా వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో చిరుకు దర్శకుడే కరువయ్యాడిప్పుడు.

విశ్వంభర తర్వాత హరీష్ శంకర్‌తోనే చిరంజీవి సినిమా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. లాజికల్‌గా ఈ ఒక్క కాంబోకే ఎక్కువ ఛాన్స్ ఉంది. రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరిదశకు రావడం.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో.. చిరుతో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు హరీష్ శంకర్. మరి చూడాలిక.. చిరును మెప్పించే ఆ దర్శకుడెవరో..?