చారిత్రక, పౌరాణిక సినిమాలంటే జస్ట్ కథాపరంగానే కాదు, ఎన్నెన్నో రకాలుగా ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. అందులో మరింత కీలకమైన విషయం ఆభరణాలు. కొన్ని సబ్జెక్టులను తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నప్పుడే ఆభరణాల విషయంలో ముందు ఓ క్లారిటీకి వచ్చేస్తుంటారు. రీసెంట్‌గా తెలుగులో శాకుంతలం సినిమా విషయంలో ఆభరణాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు జనాలు.