- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: KKR Players And Fans Celebrate Third Title With Champions T Shirts, Photos Goes Viral
IPL 2024: గెలుస్తామని ముందే ఫిక్స్ అయ్యారు! కోల్‌కతా ‘ఛాంపియన్స్ 2024’ టీ షర్ట్స్ చూశారా?
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ( మే26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించి మూడోసారి చాంపియన్ గా నిలిచింది. గతంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచింది కోల్ కతా నైట్ రైడర్స్.
Updated on: May 27, 2024 | 10:20 PM

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ( మే26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించి మూడోసారి చాంపియన్ గా నిలిచింది. గతంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచింది కోల్ కతా నైట్ రైడర్స్.

విశేషమేమిటంటే, ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించడంతోనే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంటే ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలనేది KKR గట్టి నమ్మకం. ఈ ఆత్మవిశ్వాసంతోనే KKR ఛాంపియన్స్ ట్యాగ్ లైన్‌తో టీ-షర్టులను ముద్రించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన వెంటనే KKR జట్టు సభ్యులు ఛాంపియన్స్ టీ-షర్టులు ధరించి మైదానంలో సందడి చేశారు. ఇప్పుడు KKR ఛాంపియన్స్ టీ-షర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందే గెలుస్తామనే అచంచల విశ్వాసంతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆత్మవిశ్వాసానికి చాంపియన్ టీషర్టులే నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (39) మంచి ఓపెనింగ్ అందించాడు. వన్ డౌన్ లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ (52) అర్ధ సెంచరీతో విజృంభించాడు. దీంతో కేకేఆర్ 10.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఐపీఎల్ విజేతగా నిలిచింది.




