IPL 2024: కోట్లు ఇచ్చి మరీ కొన్నారు.. ఫ్రాంచైజీల దూల తీర్చి వెళ్లారు.. లిస్టులో మనోళ్లు కూడా
IPL 17వ సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో ముగిసింది. కానీ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్లు ఎలా రాణించారో ఓసారి చూద్దాం..
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. కానీ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రేసులో ఉండి.. కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్లు ఎలా రాణించారో ఓసారి చూద్దాం..
Follow us
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. కానీ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రేసులో ఉండి.. కొందరు ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించారు. అత్యంత ఖరీదైన టాప్ 10 ప్లేయర్లు ఎలా రాణించారో ఓసారి చూద్దాం..
మిచెల్ స్టార్క్: ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియా డేంజరస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ ప్రారంభంలో స్టార్క్ చాలా ఖరీదుగా మారాడు. భారీగా పరుగులు ఇస్తూ, వికెట్లు కూడా తీయలేకపోయాడు. అయితే, కీలక మ్యాచ్‌ల్లో అంటే, ప్లే ఆఫ్స్, ఫైనల్స్‌లో తన అనుభవాన్ని ధారపోసిన స్టార్క్.. కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి తన డబ్బుకు న్యాయం చేశాడు.
పాట్ కమిన్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.75 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కమిన్స్ తనకు లభించిన ధరకు న్యాయం చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. అలాగే బౌలింగ్‌లో 18 వికెట్లు తీశాడు.
డారిల్ మిచెల్: చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి రూ. 14 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 142.60 స్ట్రైక్ రేట్‌తో 318 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.
హర్షల్ పటేల్: హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ కూడా తన ధరకు న్యాయం చేసి 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
అల్జారీ జోసెఫ్: కరీబియన్ ఆటగాడు అల్జారీ జోసెఫ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 11.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, జోసెఫ్ తనకు వచ్చిన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం లభించి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.
స్పెన్సర్ జాన్సన్: IPL 2024 వేలంలో, ఈ ఆస్ట్రేలియా బౌలర్‌కు గుజరాత్ టైటాన్స్ రూ. 10 కోట్లు చెల్లించింది. అయితే పేలవమైన ప్రదర్శన చేసిన స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
సమీర్ రిజ్వీ: చెన్నై సూపర్ కింగ్స్ అన్ క్యాప్డ్ సమీర్ రిజ్వీని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, టీమ్ మేనేజ్మెంట్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో యువ బ్యాట్స్‌మన్ సక్సెస్ కాలేకపోయాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 51 పరుగులు మాత్రమే చేశాడు.
రిలే రూసో: రూ.8 కోట్లతో పంజాబ్ కింగ్స్‌లో చేరిన రిలే రూసో తన ధరను సమర్థించుకున్నాడు. అతను ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 181.90 స్ట్రైక్ రేట్‌తో 211 పరుగులు చేశాడు.
షారుఖ్ ఖాన్: ఐపీఎల్ 2024 వేలంలో షారూఖ్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అతను 127 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
రోవ్‌మన్ పావెల్: కరేబియన్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.4 కోట్లకు ఒప్పందం చేసుకుంది. అయితే, టీమ్ మేనేజ్ మెంట్ లెక్కల ప్రకారం ఆడడంలో పావెల్ విఫలమయ్యాడు. పావెల్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 103 పరుగులు మాత్రమే చేశాడు.