- Telugu News Photo Gallery Cricket photos SRH Captain Pat Cummins And KKR Bowler Mitchell Starc Get More Than IPL Prize Money
IPL 2024: పెట్టి పుట్టారయ్యా.. ఐపీఎల్ విజేత ప్రైజ్ మనీ కంటే మీకే ఎక్కువ డబ్బు.. లిస్టులో ఇద్దరు..
IPL 2024 KKR vs SRH: IPL 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచింది. అయితే, ఇద్దరు ఆటగాళ్లు విజేత, రన్నరప్ జట్ల కంటే ఎక్కువ మనీ అందుకున్నారు.
Updated on: May 27, 2024 | 2:10 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ముగిసింది. ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చాంపియన్‌గా నిలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ ట్రోఫీతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందుకుంది. అదేవిధంగా, రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 12.5 కోట్లు అందుకుంది.

విశేషమేమిటంటే.. ఈ రెండు జట్లకు అందిన ప్రైజ్ మనీ కంటే రెండు ఫ్రాంచైజీలు ఇద్దరు ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు చెల్లించాయి. అంటే ఈసారి ఐపీఎల్‌లో అత్యధిక మొత్తానికి వేలం వేసిన ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో ఉన్నారు.

ఈ ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు స్టార్క్ రూ.24.75 కోట్లు సాధిస్తే.. ఛాంపియన్ కేకేఆర్ జట్టు రూ.20 కోట్లు మాత్రమే దక్కించుకుంది.

ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.20.50 కోట్లు వెచ్చించింది. అదే SRH టీమ్ అందుకున్న ప్రైజ్ మనీ రూ.12.50 కోట్లు మాత్రమే.

అంటే ఇద్దరు ఆటగాళ్లపై ఇరు జట్లు వెచ్చించిన మొత్తం కంటే ఐపీఎల్ ప్రైజ్ మనీ తక్కువగా మారింది. అందుకే వచ్చే సీజన్లలో ఐపీఎల్ ప్రైజ్ మనీని పెంచాలని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.




