- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Final: Shah Rukh Khan may have offered a Blank Cheque to KKR Mentor Gautam Gambhir after win over SRH
IPL 2024: గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్.. బీసీసీఐకి ఊహించని షాకిచ్చిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే?
IPL 2024: ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన SRH జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఛేదించిన కేకేఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం వెనుక సూత్రధారులలో కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా ఒకరు.
Updated on: May 27, 2024 | 12:09 PM

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం వెనుక సూత్రధారులలో కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా ఒకరు. గతంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా పనిచేసిన గంభీర్‌ను షారూక్ ఖాన్ KKRలో చేరమని ఆహ్వానించారు.

గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శన చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అంటే 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అందుకే మెంటార్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్ టీమ్ లోకి గంభీర్ ను మళ్లీ తీసుకురావాలని షారుక్ భావించాడు.

అదృష్టం కొద్దీ, గౌతమ్ గంభీర్ కూడా లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలి KKRలో చేరాడు. ఇప్పుడు గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 3వ సారి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

ఈ ఛాంపియన్‌షిప్ ముగిసిన వెంటనే, గౌతమ్ గంభీర్ KKR జట్టు నుంచి వైదొలిగినట్లు వార్తలు వ్యాపించాయి. గౌతీకి బీసీసీఐ నుంచి భారీ ఆఫర్ రావడమే ఇందుకు కారణం. అంటే, గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ కోరింది.

ఈ వార్తల తర్వాత షారుఖ్ ఖాన్ కూడా అలర్ట్ అయ్యారు. గౌతం గంభీర్‌ని వదులుకోవడానికి కింగ్ ఖాన్ కూడా సిద్ధంగా లేడు. అందుకే షారూఖ్ ఖాన్ కేకేఆర్ మెంటార్‌కి బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

Shah Rukh Khan Gautam Gambh

అంటే వచ్చే పదేళ్లపాటు కేకేఆర్ టీమ్‌కు గౌతమ్ గంభీర్ హెడ్‌గా ఉండాలని షారుఖ్ ఖాన్ కోరుకుంటున్నాడు. గంభీర్ తనకు కావాల్సిన డబ్బును బ్లాంక్ చెక్ లో రాసి తీసుకోవచ్చని చెప్పాడంట. మీ సేవలు తప్పనిసరి అంటూ షారూఖ్ ఖాన్ కేకేఆర్ టీమ్‌ని ఒప్పించినట్లు సమాచారం.

ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ఆఫర్‌ను గౌతమ్ గంభీర్ అంగీకరిస్తే, అతను టీమిండియా కోచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే భారత జట్టు కోచ్ ఏ ఫ్రాంచైజీ లీగ్‌లోనైనా జట్టు కోచ్ లేదా మరే ఇతర హోదాలో ఉండకూడదనే నిబంధన ఉంది. దీంతో గౌతమ్ గంభీర్ తదుపరి ఎత్తుగడ ఏమిటనేది ఆసక్తిగా మారింది.




